Viral Video : రైళ్లో ప్రయాణిస్తున్న వృద్ధురాలి నిజాయితీకి టీసీ షాక్.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Dec 19 , 2024 | 06:54 PM
టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తూ టీసీకి చిక్కేవారూ బోలెడంతమంది ఉంటారు. అందుకు భిన్నంగా నిజాయితీతో వ్యవహరించి టీసీని ఆశ్చర్యపరచింది ఓ వృద్ధ ప్రయాణీకురాలు. అమాయకంగా ఆమె మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లున్నారా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు నెటిజన్లు. ఇంతకీ, ఆమె ఏం చేసిందంటారా..
చిన్నపిల్లలను ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లేటప్పుడు వారి కోసం టికెట్ కొనుగోలు చేసేందుకు వెనుకాడుతుంటారు చాలామంది. వారి వయసు తక్కువ చేసి చెప్పేందుకు ప్రయత్నింటారు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తూ టీసీకి చిక్కేవారూ బోలెడంతమంది ఉంటారు. అందుకు భిన్నంగా నిజాయితీతో వ్యవహరించి టీసీని ఆశ్చర్యపరచింది ఓ వృద్ధ ప్రయాణీకురాలు. అమాయకంగా ఆమె మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లున్నారా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ, ఆమె ఏం చేసిందంటారా..
మన దేశంలో ఇప్పటికీ సామాన్యులు మెచ్చేది రైలు ప్రయాణమే. గమ్యం చేరడం ఆలస్యమవుతుందని తెలిసినా.. ప్రయాణఖర్చులు కలిసొస్తాయనే ఉద్దేశంతో రోజువారీ లేదా దూరప్రయాణాలకు రైలుకే ఓటేస్తారు. కొంతమంది ప్రయణీకులు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ టీసీకి అడ్డంగా దొరికిపోతుంటారు. టికెట్ లేకుండా ప్రయాణించడం నేరమని రైల్వేశాఖ ఎన్ని ప్రకటనలు చేసినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. నిరక్షరాస్యుల సంగతి పక్కన పెడితే, పెద్ద చదువు చదివి కూడా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ అభాసుపాలవుతున్నారు ఎంతోమంది. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా వ్యవహరించింది ఓ వృద్ధ ప్రయాణీకురాలు. ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా..
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ దగ్గరికి టీసీ వచ్చి టికెట్ తీసుకున్నారా అని అడగ్గా, ఆమె అవునని సమాధానం చెప్పింది. టీసీకి ఒకరికి బదులుగా ఇద్దరి కోసం తీసుకున్న టికెట్ చూపించింది. ఇద్దరి కోసం ఎందుకు అని టీసీ ప్రశ్నించగా.. పక్కనే ఉన్న తన మేక కోసమని నవ్వుతూ బదులిచ్చింది. వృద్ధ మహిళ తన కోసమే కాక మేక కోసమూ టికెట్ కొనుగోలు చేయడం చూసి టీసీతో పాటు తోటి ప్రయాణీకులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైళ్లో టీసీ టికెట్ చూపించమని అడిగినపుడు.. వృద్ధ మహిళ నిజాయితీగా, గర్వంగా సమాధానం చెబుతున్న తీరును ఓ ప్రయాణీకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
మేక కోసం టికెట్ కొనుగోలు చేసి టీసీకి షాక్ ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా వీక్షించగా.. 29 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇక ఓ నెటిజన్ ఇలా వ్యాఖ్యానించాడు. "ఎంత అద్భుతమైన ఆలోచన. మేక ఆమెకి కేవలం జంతువు కాదు. కుటుంబంలో భాగం. కుటుంబ సభ్యునితో ఎలా వ్యవహరించాలో, వారిని మనతో సమానంగా ఎలా చూడాలో ఈమెని చూసి అర్థం చేసుకోండి. ఈ వృద్ధురాలిది గొప్ప హృదయం." జంతువులను రైలు ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడం తప్పే అయినా.. బాధ్యతతో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తున్న వృద్ధ మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - Dec 19 , 2024 | 06:54 PM