ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఎలుగుబంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి.. ఈ పులికి ఎలాంటి షాక్ ఇచ్చిందంటే..

ABN, Publish Date - May 07 , 2024 | 05:19 PM

పులులు, సింహాల వేటకు తిరుగు ఉండదు అని అందరికీ తెలిసిందే. కానీ కొన్నిసార్లు అలాంటి జంతువులకూ ఓటమి ఎదురవడం కూడా చూస్తుంటాం. కొన్నిసార్లయితే చిన్న చిన్న జంతువుల చేతిలో కూడా ఘోరంగా ఓడిపోతుంటాయి. ఇలాంటి..

పులులు, సింహాల వేటకు తిరుగు ఉండదు అని అందరికీ తెలిసిందే. కానీ కొన్నిసార్లు అలాంటి జంతువులకూ ఓటమి ఎదురవడం కూడా చూస్తుంటాం. కొన్నిసార్లయితే చిన్న చిన్న జంతువుల చేతిలో కూడా ఘోరంగా ఓడిపోతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలుగుబంటితో పెట్టుకున్న ఓ పులికి చివరకు షాకే తగిలింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎలుగుబంటితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకులు వాహనాల్లో అడవిలో పర్యటిస్తుండగా.. మధ్యలో వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆకలితో ఉన్న ఓ పులి.. దారిలో వెళ్తూ వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంచెం దూరంలో దానికి ఓ ఎలుగుబంటి కనిపిస్తుంది.

Viral video: మెట్రో రైల్లో ప్రేమికుల పాడు పని.. ప్రయాణికుడి ఫిర్యాదుకు పోలీసుల రియాక్షన్ ఇదీ..


ఎలుగుబంటిని చూడగానే నడుస్తున్న పులి కాస్తా.. ఒక్కసారిగా నేలపై పడుకుని గమనిస్తుంది. ఎలుగుబంటి దారికి అటు వైపు వెళ్లిపోతుంది. అది అలా వెళ్లగానే పులి దానిపై దాడి చేయాలని చూస్తుంది. సమీపానికి వెళ్లి పొదల్లో ఉన్న ఎలుగుబంటిని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో లోపలి నుంచి సడన్‌గా బయటికి వచ్చిన ఎలుగుబంటి.. (bear chasing a tiger) పులిని కొద్ది దూరం వెంబడిస్తుంది. ఎలుగుబంటి ఆవేశాన్ని చూసిన పులి భయంతో అలాగే నిలబడిపోయి చూస్తూ ఉండిపోతుంది.

Viral: పాల బాటిల్‌ను పక్కకు నెట్టేసిన చిన్నారి.. అనుమానం వచ్చి పరిశీలించిన బామ్మకు దిమ్మతిరిగే షాక్..


పులిని భయపెట్టిన ఎలుగుబంటి.. ‘‘జాగ్రత్త.. ఇంకోసారి నా జోలికి వచ్చావో.. నీ అంతు చూస్తా’’.. అంటూ హెచ్చరించినట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎలుగుబంటిని ఏమీ చేయలేని పులి.. అలాగే నిస్సహాయంగా దాని వైపు చూస్తూ ఉండిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుబంటి పవర్ అంటే ఇది’’.. అంటూ కొందరు, ‘‘తోక ముడిచిన పులి’’.. అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: చేపనేమో పట్టాడు గానీ.. దాని వెంటే వచ్చిన అతి పెద్ద అతిథిని చూసి షాక్.. చివరకు..

Updated Date - May 07 , 2024 | 05:19 PM

Advertising
Advertising