ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

ABN, Publish Date - Aug 18 , 2024 | 05:04 PM

ఏనుగులకు ఎంత శక్తి ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులోనూ ఆకలితో, కోపంతో ఉన్న ఏనుగులు ఎలా ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పిల్ల మొక్కల్లా పీకి పడేస్తుంటాయి. అలాగే అంతెత్తున ఉన్న పండ్లను సైతం ఎంతో సులభంగా తెంచేసి తింటుంటాయి. ఇక వాటికి ..

ఏనుగులకు ఎంత శక్తి ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులోనూ ఆకలితో, కోపంతో ఉన్న ఏనుగులు ఎలా ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పిల్ల మొక్కల్లా పీకి పడేస్తుంటాయి. అలాగే అంతెత్తున ఉన్న పండ్లను సైతం ఎంతో సులభంగా తెంచేసి తింటుంటాయి. ఇక వాటికి తిక్కరేగిన సమయంలో ఊరి మీద పడి ఇళ్లను పీకి పందిరేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ అతి పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగానే.. కళ్లు మూసి తెరిచే లోపు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అతి పెద్ద ఏనుగు సంక్షణ బాధ్యతలు చూసుకుంటున్న వ్యక్తి దానికి సపర్యలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఏనుగు దాహం వేసిందని తెలుసుకున్న ఆ వ్యక్తి.. నీళ్ల బకెట్లను సిద్ధం చేసుకుంటాడు. కంచె వద్దకు వచ్చిన ఏనుగు నీళ్లు తాగేందుకు వేచి చూస్తూ ఉంటుంది.

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. రోడ్డు పక్కన స్కూటీ ఆపి.. సమీపంలోని గేటు వద్దకు వెళ్లి..


ఆ తర్వాత సదరు వ్యక్తి బకెట్ నీటిని తీసుకుని ఏనుగు ఎదురుగా పెడతాడు. బకెట్ నీటిని ఇలా పెట్టగానే.. ఏనుగు తొండాన్ని అందులో ముంచేస్తుంది. కళ్లు మూసి తెరిచేలోగా (elephant drinking bucket of water in seconds) బకెట్‌లోని నీటిని మొత్తం ఖాళీ చేసేస్తుంది. చివరగా అందులో ఉన్న కొద్దిపాటి నీటిని ఆ వ్యక్తి తొండంలో పోసేస్తాడు. ఇలా అత పెద్ద బకెట్ నీటిని కూడా ఆ ఏనుగు క్షణాల్లో హాంఫట్ చేసేస్తుంది.

Viral Video: అప్పటిదాకా మనిషిలా ఉంటూ.. అంతలోనే రోబోలా ఎలా మారిపోయాడో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘బకెట్ నీళ్లు కూడా ఈ ఏనుగు గ్లాస్ నీళ్లు మాత్రమే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 05:04 PM

Advertising
Advertising
<