ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కోతి చేష్టలు చేస్తున్న పక్షులు.. వ్యక్తి భోజనం చేస్తుంటే సడన్‌గా ఎంట్రీ ఇచ్చి..

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:01 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వీల్ చైర్‌లో కూర్చుని భోజనం చేస్తుంటాడు. అతడికి ఎదురుగా ప్లేట్‌లో పచ్చి చేపలు, రొయ్యలు తదితర ఆహార పదార్థాలు ఉంటాయి. అయితే తీరా వాటిని తింటుండగా దూరం నుంచి..

మనుషుల చేతుల్లోని తినుబండారాలను కోతులు లాక్కోవడం చూస్తుంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎలాగోలా మనుషుల చేతుల్లోని తినుబండారాలను లాక్కెళ్తుంటాయి. అయితే ఇలాంటి పనులే పక్షులు చేస్తే ఎలా ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా సడన్‌గా వచ్చిన పక్షులు ఏం చేశాయో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వీల్ చైర్‌లో కూర్చుని భోజనం చేస్తుంటాడు. అతడికి ఎదురుగా ప్లేట్‌లో పచ్చి చేపలు, రొయ్యలు తదితర ఆహార పదార్థాలు ఉంటాయి. అయితే తీరా వాటిని తింటుండగా దూరం నుంచి గమనించిన రెండు పక్షులు ఎగురుకుంటూ సమీపానికి వస్తాయి. చేతిలోని రొయ్యను లాక్కునే ప్రయత్నం చేస్తాయి.

Viral Video: కిచెన్‌లో వంట ఎలా చేస్తున్నారో చూస్తే.. అవాక్కవడం ఖాయం..


అయితే అతను విదిలిండంతో పక్కకు వెళ్లిపోతాయి. అయితే మధ్యలో అతను వైల్ చైర్‌‌లో కాస్త పక్కకు వెళ్తాడు. దీంతో అప్పటిదాకా అటూ ఇటూ తిరిగిన పక్షులు నేరుగా టేబుల్‌పై వాలి పచ్చి చేప ముక్కలను (birds steal the fish pieces) నోట కరుచుకుని వెళ్లిపోతాయి. దీంతో సదరు వ్యక్తి గమనించి వాటిని మళ్లీ పక్కకు తోలేస్తాడు. పక్షుల నిర్వాకానికి షాకైన వ్యక్తి.. చివరకు వాటి తెలివి చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాడు.

Viral Video: బాబోయ్.. ఇది పక్షి కాదు రాక్షసి.. 15 సెకన్ల గ్యాప్‌లో ఏకంగా..


అదే స్థలంలో పక్షులకు ఆహారం పెట్టవద్దని సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పక్షులు కోతులను మించిపోయాయిగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది దొంగ పక్షుల్లా ఉన్నాయే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 04:01 PM

Advertising
Advertising
<