Viral Video: డెడికేషన్ అంటే ఇదీ.. స్కూటీలో వెనుక కూర్చుని ఈ బుడ్డోడు చేస్తున్న పని చూడండి..
ABN , Publish Date - Apr 17 , 2024 | 09:32 PM
ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత.. విలువైన సమయాన్ని వృథా చేస్తూ ఎలాంటి లక్ష్యం లేకుండా తిరుగుతున్నారు. అలాగే చాలా మంది చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరి ప్రవర్తన కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ తరహా...
ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత.. విలువైన సమయాన్ని వృథా చేస్తూ ఎలాంటి లక్ష్యం లేకుండా తిరుగుతున్నారు. అలాగే చాలా మంది చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరి ప్రవర్తన కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్కూటీలో వెళ్తున్న పిల్లాడు.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన పిల్లలను స్కూటీలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తోంది. ఆమె తన కూతురును ముందు వైపు కూర్చోబెట్టుకోగా.. వెనుక కొడుకును కూర్చోబెట్టింది. స్కూటీ వెళ్తుండగా వెనుక కూర్చున్న పిల్లాడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్కూల్ డ్రెస్ వేసుకున్న బాలుడు.. పాఠశాలకు వెళ్లే క్రమంలో ( boy studying on scooty) స్కూటీ పైనే పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. స్కూటీ సీటుపై పేపర్లు పెట్టుకుని పెన్నుతో రాసుకుంటున్నాడు.
Viral Video: వరదలను ఇలా వాడేసుకున్నారు.. వీళ్ల బిజినెస్ మామూలుగా లేదుగా..
చదువుపై ఈ బుడ్డోడికి ఉన్న శ్రద్ధ చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న మిగతా వాహనదారులు.. బుడ్డోడి డెడికేషన్‌కు ఫిదా అయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘చదువుపై ఈ పిల్లాడి శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలంతా ఈ విద్యార్థిని చూసి నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger attack Video: ఈ దున్నపోతు టైం బాగుంది.. ప్రాణాలు పోతాయనగా.. చివరి క్షణంలో..