Viral Video: కారును ధ్వంసం చేసి ప్రియుడిని లాక్కెళ్లిన దండగులు.. చివరికి ప్రియురాలికి షాకింగ్ సర్‌ప్రైజ్..
ABN, Publish Date - Dec 21 , 2024 | 10:59 AM
ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బైకులపై అసభ్యకరంగా ప్రయాణం చేస్తూ కొందరు, బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటూ మరికొందరు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు..
ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బైకులపై అసభ్యకరంగా ప్రయాణం చేస్తూ కొందరు, బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటూ మరికొందరు అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు ప్రేమికులు విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రేమికుల కారును ఆపిన దుండగులు.. ధ్వంసం చేసి ప్రియుడిని లాక్కెళ్లారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన ప్రియుడితో పాటూ కారులో వెళ్తుంటుంది. మార్గ మధ్యలో కొందరు ట్రక్కును రోడ్డుపై నిలిపి ఉంటారు. ట్రక్కును చూడగానే ప్రేమికులు కారు ఆపేస్తారు. కారు ఆపిన కొద్దిసేపటి తర్వాత ట్రక్కులో నుంచి కిందకు దిగిన దండగులు (Thugs broke car windows) కారు అద్దాలను ధ్వంసం చేస్తారు.
Viral Video: ఇదేం విన్యాసంరా బాబోయ్.. మూర్ఖత్వానికి పరాకష్ట అంటే ఇదేనేమో..
తర్వాత కారులో ఉన్న ప్రియుడిని బయటికి లాగి, ట్రక్కులో పడేస్తారు. దీంతో కారులో ఉన్న యువతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. ట్రక్కులో ఉన్న ప్రియుడు కాస్త.. పూల బొకేతో కిందకు దిగి కారు వద్దకు వస్తాడు. తన ప్రియురాలి వద్దకు వెళ్లి బొకే ఇచ్చి, (boyfriend proposed love to his girlfriend) తన లవ్ ప్రపోజ్ చేస్తాడు. ప్రియుడు ఇచ్చిన ఈ షాక్ నుంచి కాసేపటికి తేరుకున్న ఆమె.. తర్వాత ఆనందంతో అతడిని హత్తుకుంటుంది.
ఇలా తన ప్రియురాలికి వినూత్నంగా లవ్ ప్రపోజ్ చేసిన ప్రియుడి వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లవ్ ప్రపోజ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ప్రియురాలికి భలే షాకిచ్చాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50 లక్షలకు పైగా లైక్‌లు, 58.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మరీ కరువు బ్యాచ్‌లా ఉన్నారే.. పెళ్లిలో దోసెలు వేస్తుండగా.. వీళ్ల నిర్వాకం చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 21 , 2024 | 10:59 AM