Viral: పొట్టేళ్లను శాంత పరిచేందుకు డియోడరెంట్ వినియోగం!
ABN , Publish Date - Apr 21 , 2024 | 10:24 PM
మగ గొర్రెల మధ్య పోట్లాటలను తగ్గించేందుకు బ్రిటన్‌లోని గొర్రెల కాపర్లు డియోడరెంట్ వాడుతున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టేళ్ల మధ్య పోట్లాటలను తగ్గించేందుకు బ్రిటన్‌లోని గొర్రెల కాపర్లు డియోడరెంట్ వాడుతున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. మగ గొర్రెలను నిలువరించలేకపోతున్న వారికి ఈ టెక్నిక్ ఓ మంత్రంలా పనిచేస్తోంది. గొర్రెలపై డియోడరెంట్ జల్లిన తరువాత అవి కయ్యానికి కాలుదువ్వడం మానేస్తున్నాయి. గొర్రెలను కంట్రోల్ చేసేందుకు అక్కడి వారు ఎక్కువగా యాక్స్ ఆఫ్రికా డియోడరెంట్‌ను వాడుతున్నారు. ఇది తప్ప మరేదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వట్లేదని కూడా అంటున్నారు.
Viral: 8 మంది ఉన్న ఫ్యామిలీ.. హోటల్‌లో ఫుల్లుగా మెక్కి రూ.34 వేల బిల్లు చేసి..ఆపై..
Ladies Who Lamb అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో తొలిసారిగా ఈ కిటుకు గురించిన పోస్టు కనిపించిందని స్థానిక వ్యక్తి ఒకరు తెలిపారు. డియోడరెంట్ వాసనకు గొర్రెలు ఇతర వాసనలను గుర్తుపట్టలేకపోతున్నాయని ఆయన చెప్పాడు. దీంతో, ఉద్రేకం, ఉన్మాదం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గి అవి శాంతంగా ఉంటున్నాయని అన్నాడు. డియోడరెంట్‌లోని ఘాటైన వాసనే ఇందుకు కారణమని అన్నారు (British Farmers Spray Rams With Deodorant To Prevent Fights).
ఇది ఆడ గొర్రెలపై కూడా పనిచేస్తోందని అతడు చెప్పుకొచ్చాడు. ఈ వాసన కారణంగా ఆడ గొర్రెలు తమకు సంబంధం లేని గొర్రె పిల్లలను తమవిగా భావించి సాకుతున్నాయని చెప్పుకొచ్చాడు. ఇది తమను కూడా ఆశ్చర్యపరుస్తోందని అన్నాడు. కాగా, యూనీలివర్ సంస్థ 1983లో ఫ్రాన్స్‌లో యాక్స్ పేరుతో డియోడరెంట్‌ను లాంచ్ చేసింది. ఈ పేరుపై కాపీరైట్ ఉన్న ఇతర దేశాల్లో లింక్స్ పేరుతో డియోడరెంట్‌ను విక్రయిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి