ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: దున్నపోతును వేటాడిన సింహాలు.. తీరా తినే సమయంలో మొదలైన గొడవ.. చివరకు జరిగింది చూస్తే..

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:34 PM

ప్రాణాలు పోతాయనుకుంటున్న సమయంలో కొన్నిసార్లు మిరాకిల్స్ జరుగుతుంటాయి. దీంతో జీవితంలో ఆశలు వదులుకున్న వారు కూడా తిరిగి కొత్త జీవితాన్ని మొదలెడుతుంటారు. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ముఖ్యంగా పులులు, సింహాల దాడి సమయంలో ఇలాంటి ..

ప్రాణాలు పోతాయనుకుంటున్న సమయంలో కొన్నిసార్లు మిరాకిల్స్ జరుగుతుంటాయి. దీంతో జీవితంలో ఆశలు వదులుకున్న వారు కూడా తిరిగి కొత్త జీవితాన్ని మొదలెడుతుంటారు. అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ముఖ్యంగా పులులు, సింహాల దాడి సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని సింహాలు కలిసి ఓ దున్నపోతును వేటాడతాయి. అయితే తీరా చంపేసే సమయంలో ఉన్నట్టుండి వాటి మధ్య గొడవ జరుగుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న సింహాలకు ఉన్నట్టుండి దున్నపోతుల మంద కనిపిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవన్నీ కలిసి వాటిపై దాడి చేస్తాయి. చివరకు అన్నీ కలిసి ఒక దున్నపోతును చుట్టుముట్టి (Lions attacked the buffalo) మూకుమ్మడిగా దాడి చేస్తాయి. దీంతో మిగతా దున్నపోతుల మంద అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది. దున్నపోతును కిందపడేసిన సింహాలు చివరకు దాన్ని తినే ప్రయత్నం చేస్తుంటాయి.

Viral Video: బంగాళాదుంపల బాక్సు నుంచి వింత శబ్ధాలు.. కంగారుగా తెరచి చూడగా.. షాకింగ్ సీన్..


అయితే ఇంతలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వాటిలో ఓ సింహం ఇంకో సింహంపై దాడి చేస్తుంది. దీంతో మిగతా సింహాలు అలెర్ట్ అవుతాయి. దున్నపోతును తినపోతున్న సింహాలు కూడా అక్కడి నుంచి పక్కకు వచ్చి దాడి చేయబోయిన సింహాలపై ఎదురు దాడి చేస్తాయి. ఇలా చాలా సేపు వాటి (fight between lions) మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత దాడికి గురైన సింహం.. అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో మిగతా సింహాలన్నీ దాన్ని అనుసరిస్తూ వెళ్తాయి.

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..


అయితే మరోవైపు కిందపడిన దున్నపోతు.. ‘‘ఇదే కదా మంచి తరుణం’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయి మందలో కలిసిపోతుంది. ఇలా సింహాల మధ్య జరిగిన గొడవ కారణంగా దున్నపోతు ప్రాణాలతో బయటపడిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాల గొడవ దున్నపోతుకు కలిసొచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ దున్నపోతుకు భూమ్మీద నూకలున్నట్లున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. కారులో ఛేజ్ చేసిన యువకులు.. చివరకు అసలు విషయం చెప్పడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 12 , 2024 | 04:34 PM

Advertising
Advertising