Tamilnadu: ఛీ ఛీ.. ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. డాక్టర్, నర్సు కలిసి.. వీడియో వైరల్
ABN, Publish Date - Jun 19 , 2024 | 06:16 PM
చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది. అందులో పని చేసే డాక్టర్, నర్సు కలిసి.. ఆపరేషన్ రూమ్‌లో రొమాన్స్ చేస్తూ కెమెరాకి చిక్కారు. ఆ వీడియోలోని..
చెన్నైలోని (Chennai) ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ షాకింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది. అందులో పని చేసే డాక్టర్, నర్సు కలిసి.. ఆపరేషన్ రూమ్‌లో రొమాన్స్ చేస్తూ కెమెరాకి చిక్కారు. ఆ వీడియోలోని డాక్టర్ని సుబ్బయ్య షన్ముగంగా (Subbaiah Shanmugam) గుర్తించారు. అలాగే.. అందులోని నర్సు ఆపరేషన్ థియేటర్లో పని చేసే మహిళ అని తేలింది. ఈ ఘటన నగరంలోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వీడియో కలిగిన పెన్‌డ్రైవ్‌తో పాటు ఒక లేఖను ఓ జాతీయ వెబ్‌సైట్‌కి పంపించారు.
Read Also: విరాట్ కోహ్లీ.. దయచేసి ఆ పని చేయకు
అయితే.. ఈ ఘటన గురించి తమకు ఎలాంటి సమాచారం గానీ, డాక్టర్ సుబ్బయ్యపై ఫిర్యాదు గానీ అందలేదని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఏదేమైనా.. వీడియో బయటకు వచ్చింది కాబట్టి దీనిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ‘‘డాక్టర్‌పై మాకు ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కానీ.. జూన్ 14వ తేదీ నుంచి ఈ వీడియో చక్కర్లు కొడుతోంది కాబట్టి విచారణ ప్రారంభించాం’’ అని రాయపేట ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆయిషా చెప్పారు. మరోవైపు.. ఈ వీడియో ఎవరు, ఎందుకు తీశారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
Read Also: బాలిక హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ వీడియోలకు బానిసై..
ఇదిలావుండగా.. గతంలో డాక్టర్ షణ్ముగంపై 2020లో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. పొరుగింటి వారితో పార్కింగ్ విషయమై ఆయన పెద్ద గొడవకే దిగిన సందర్భమూ ఉంది. వారి ఇంటి గేట్లపై మూత్ర విసర్జన చేసి.. వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం గతంలో వైరల్ అయ్యింది. ఇప్పుడు నర్సుతో రొమాన్స్ చేస్తున్న వీడియో తెరమీదకి రావడంతో ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 06:16 PM