Viral Video: ఖంగుతినిపిస్తున్న కాలువ.. పొరపాటున న్యూటన్ గానీ ఉండుంటే..
ABN, Publish Date - Apr 27 , 2024 | 04:56 PM
యాపిల్ పండు నైలపై పడడం చూసిన న్యూటన్.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చారు. ఆ తర్వాత ఆయన దీనిపై అనేక పరిశోధనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ కాలువ వీడియో చూసి..
యాపిల్ పండు నైలపై పడడం చూసిన న్యూటన్.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చారు. ఆ తర్వాత ఆయన దీనిపై అనేక పరిశోధనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ కాలువ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. న్యూటన్ చెప్పినదానికి విరుద్ధంగా జరగడం చూసి షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘పొరపాటున న్యూటన్ ఈ వీడియో చూస్తే.. మరిన్ని పరిశోధనలు చేస్తారేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) మెయిన్‌పర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యూట్యూబర్ (YouTuber) ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించిన క్రమంలో కాలువ వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా కాలువలో నీటి ప్రవాహం ఎలా వెళ్తోంటే.. నీటిపై ఉన్న ఆకులు తదితరాలు కూడా అదే క్రమంలో కొట్టుకుపోతుంటాయి. అయితే ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది.
Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..
సదరు యూట్యూబర్ కాలువలో ఓ ఆకు వేయగానే.. అది నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా రివర్స్‌లో వెళ్లింది. ఆకు అలా వెళ్లడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.., ‘‘పొరపాటున న్యూటన్ ఈ వీడియో చూస్తే.. మరిన్ని పరిశోధనలు చేస్తారేమో’’.. అంటూ కొందరు, ‘‘చుట్టూ ఉన్న కొండల కారణంగా ఇదంతా ఓ భ్రమలా కనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా జరగడం అసాధ్యం.. ఇది ఓ ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Apr 27 , 2024 | 09:50 PM