Viral Video: వామ్మో..! ఇది నోరా.. లేక నీటి కొళాయా..
ABN, Publish Date - Mar 30 , 2024 | 09:01 PM
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది దీన్ని వేదికగా చేసుకుని తమ ప్రతిభను బయటపెడుతున్నారు. కొందరు ఎవరూ చేయని సాహసాలు చేస్తూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతుంటారు. ఇలాంటి సాహసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా...
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది దీన్ని వేదికగా చేసుకుని తమ ప్రతిభను బయటపెడుతున్నారు. కొందరు ఎవరూ చేయని సాహసాలు చేస్తూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతుంటారు. ఇలాంటి సాహసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ యువకుడు చేసిన సాహసానికి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన నోటి నుంచి నీటిని ఏకదాటిగా బయటికి తీశాడు. మొత్తం 4.5 లీటర్ల నీటిని ఏకదాటిగా బయటికి తీసి, గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చైనాకు (China) చెందిన 35 ఏళ్ల మహువా అనే వ్యక్తి నీటితో వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా అతను ఒకేసారి కొన్ని లీటర్ల నీటిని అందరి సమక్షంలో తాగేశాడు. తర్వాత ఆ నీటిని నోటి నుంచి బయటికి తీసేందుకు సిద్ధమయ్యాడు. టైం స్టార్ట్ అవగానే నోటి నుంచి నీటిని బయటికి తీయడం స్టార్ట్ చేశాడు. ఓ వైపు ఊపిరి తీసుకుంటూనే, మరోవైపు నీటిని ఏకదాటిగా బయటికి తీస్తూనే ఉన్నాడు.
Fuzzle: ఈ రెండు ఫొటోల్లో మూడు తేడాలున్నాయి. కనిపెడితే మాత్రం మీకు తిరుగులేనట్లే..
ఇలా అతను 5 నిముషాల 51.88 సెకన్ల వ్యవధిలో 4.5లీటర్ల నీటిని బయటికి తీశాడు. ఈ రికార్డు గతంలో ఇథియోపియాకు (Ethiopia) చెందిన కిరుబెల్ యిల్మా అనే వ్యక్తి పేరుతో ఉండేది. ప్రస్తుతం చైనాకు చెందిన మహువా అనే వ్యక్తి ఈ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇది నోరా లేక నీటి కొళాయా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసం చేయడం చాలా కష్టం’’.. అంటూ మరికొందరు, ‘‘మీ టాలెంట్ అద్భుతం బ్రదర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: విమానాశ్రయాన్ని కూడా వదల్లేదు.. లగేజీ ట్రాక్‌పై ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే..
Updated Date - Mar 30 , 2024 | 09:01 PM