ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: జలాకాలాటల్లో స్నేహితులు.. వెనుకే పడగవిప్పిన నాగుపాము.. చివరకు..

ABN, Publish Date - Aug 24 , 2024 | 09:28 PM

సరదాగా గడుపుతున్న సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా అవుతుంటుంది. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు..

సరదాగా గడుపుతున్న సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా అవుతుంటుంది. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు స్నేహితులు నీళ్ల తొట్టిలో స్నానం చేస్తుంటారు. ఇంతలో వారి వెనుకే ఓ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతుంటుంది. చివరకు ఏం జరిగిందో మీరూ చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు స్నేహితులు (friends) ఓ నీళ్ల తొట్టిలో స్నానం చేస్తుంటారు. తొట్టిలోకి ఏర్పాటు చేసిన నీళ్ల పైపు కింద మునుగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. తొట్టి వద్దకు వచ్చిన నాగు పాము (Cobra) మెల్లగా గోడ పైకి ఎక్కి పడగ విప్పి బుసలు కొడుతుంటుంది. కానీ వాళ్లు మాత్రం జలకాలాటల్లో మునిగిపోయి ఉంటారు.

Viral Video: కోడితో పాటూ మనిషినీ లాగేయాలని చూసిన మొసలి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


మరో వైపు పాము వారి వైపు చూస్తూ.. ‘‘నా స్థావరంలోకి వచ్చి స్నానం చేస్తున్నారా.. ఇక్కడి నుంచి వెళ్లిపోతారా.. కాటేసి చంపేయమంటా’’.. అన్నట్లుగా తల అటూ ఇటూ ఊపుతూ వారినే గమనిస్తుంటుంది. ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి స్నానం చేస్తూ ఇటు వైపు తిరుగుతాడు. ఒక్కసారిగా పడగవిప్పిన పామును చూసి షాక్ అవుతాడు. గట్టిగా కేకలు వేస్తూ నీళ్లలో పడిపోతాడు. చివరగా ఇద్దరూ పామును చూసి భయంతో వణికిపోతారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..


ఇదంగా గమనిస్తే.. వ్యూస్ కోసం కావాలనే ఇలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. అయినా కూడా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాము ఏరియాని వెంటనే ఖాళీ చేయండి’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాము పెయిడ్ యాక్టర్‌లా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 79 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రాణం పోయే ముందు ప్రతాపం చూపించిన రొయ్య.. ఈ యువతికి ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 09:28 PM

Advertising
Advertising
<