ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: జాతరలో రద్దీ జనం మధ్య జంట విచిత్ర నిర్వాకం.. ముద్దులు పెట్టుకుంటూ..

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:57 PM

బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తించే ఘటనలు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొందరు మరీ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు...

బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు అసభ్యకరంగా ప్రవర్తించే ఘటనలు నిత్యం ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొందరు మరీ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పార్కుల్లో, మరికొందరు రైళ్లలో, ఇంకొందరు వాహనాలపై వెళ్తూ హద్దులు మీరి ప్రవర్తించడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ జాతర ఉత్సవంలో ఓ జంట నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ హల్‌‌చల్ చేస్తో్ంది. రద్దీగా ఉన్న జనం మధ్య ముద్దులు పెట్టుకుంటూ వారు చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని నౌచండి మేళాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మేళా సందర్భంగా అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. జనం రద్దీగా ఉండగా.. ఓ జంట చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు. చుట్టూ జనం ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయిన వారు.. అందరి (couple kissing in middle of the crowd) ముందూ కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు.

Viral Video: ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


చుట్టూ జనం చూస్తున్నా కూడా వారు మాత్రం అలాగే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అంత మంది జనంలో ఉన్నా కూడా వారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి అంతా షాక్ అయ్యారు. జాతర సందర్భంగా కొందరు డబ్బులు తీసుకుని వీడియో షూట్ చేస్తుంటారని తెలిసింది. ఆ కెమెరా ముందే ఈ జంట ఇలా ముద్దులు పెట్టుకుంటూ కనిపించిందని గుర్తించారు. ఎంత వీడియో షూట్ అయినా జనం మధ్యలో ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: నడి రోడ్డుపై జింకను చుట్టేసిన కొండచిలువ.. చంపేసే సమయంలో ఉన్నట్టుండి..


కొందరు ఆ జంటను వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ‘‘నాలుగు గోడల మధ్య చేసుకోవాల్సిన పనులు నడిరోడ్డులో చేస్తున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇది మరీ దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగానే వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తలుపుచాటుకు వెళ్లిన బల్లి.. తరిమికొట్టాలని స్ప్రేతో వెళ్లిన యువతి.. తీరా చూస్తే షాకింగ్ సీన్..

Updated Date - Jul 23 , 2024 | 03:57 PM

Advertising
Advertising
<