ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కర్మ ఫలితం అంటే ఇదేనేమో.. వేటాడటమే తెలిసిన చిరుత.. చివరకు నీళ్లు తాగుతూ..

ABN, Publish Date - Oct 09 , 2024 | 08:53 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాహంతో ఉన్న ఓ చిరుత పులి నీరు తాగేందుకు ఓ చెరువు వద్దకు వెళ్తుంది. అయితే ఆ సమయంలో భయంగా భయంగా ఉన్న చిరుత.. ఎంతో జాగ్రత్తగా నీళ్లు తాగుతుంటుంది. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

‘‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలి వానకు చచ్చింది’’.. అన్న సామెత మనుషులకే కాకుండా జంతువులకూ వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పులులు, సింహాలకు ఇలాంటి పరిస్థితి తరచూ ఎదురవుతుంటుంది. వేటకు దిగితే ఓటమి ఎరుగని వాటికి కూడా.. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీళ్లు తాగుతున్న చిరుత పులి సడన్‌గా ఎలా చనిపోయిందో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కర్మ ఫలితం అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దాహంతో ఉన్న ఓ చిరుత పులి నీరు తాగేందుకు ఓ చెరువు వద్దకు వెళ్తుంది. అయితే ఆ సమయంలో భయంగా భయంగా ఉన్న చిరుత.. ఎంతో జాగ్రత్తగా నీళ్లు తాగుతుంటుంది. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. నీటి లోపల నుంచి ఓ పెద్ద మొసలి అమాంతం గుట్టు పైకి వచ్చి, (Crocodile attack on leopard) చిరుతను నీటిలోకి లాక్కెళ్తుంది.

Viral Video: ఈ కోతి చాలా సాఫ్ట్ గురూ.. బంతి భోజనంలో ఏం చేసిందో చూడండి..


ఇదంతా కళ్లు మూసి, తెరిచే లోపే జరిగిపోతుంది. మొసలి దాడి నుంచి తప్పించుకోవడానికి చిరుత ఎంతో ప్రయత్నించినా లాభం ఉండదు. నీటిలోకి లాక్కెళ్లిన మొసలి.. చూస్తుండగానే దాన్ని నీటిలోకి ముంచి కొరికి చంపేస్తుంది. ఇంతలో అక్కడ నీళ్లు తాగడానికి వచ్చిన మిగతా చిరుతలు.. ఈ ఘటన చూసి షాక్ అవుతాయి. ‘‘ఈ నీళ్లూ వద్దూ ఏమీ వద్దు.. బతికుంటే బలిశాకు తిని బతకొచ్చు ’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాయి.

Viral Video: వామ్మో..! ఎలుగుబంట్లలో ఈ టాలెంట్ కూడా ఉందా.. కారు వద్ద అది చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కర్మ ఫలితం అంటే ఇదే.. ఎన్నో జంతువులను వేటాడిన చిరుతకూ అదే పరిస్థితి వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఈ మొసలి వేట చూస్తుంటే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 09:13 PM