ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: రోడ్డుపై చిన్న పిల్లల్లా ఆడుకుంటున్న మొసలి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, Publish Date - May 29 , 2024 | 07:27 PM

అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించడం తరచూ ఎక్కడో చోట జరుగుతుంటుంది. అయితే నీటిలో జీవించే జీవులు జనావాల్లోకి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా..

అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించడం తరచూ ఎక్కడో చోట జరుగుతుంటుంది. అయితే నీటిలో జీవించే జీవులు జనావాల్లోకి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంటుంది. కాలువలో ఉన్న ఓ పెద్ద మొసలి ఉన్నట్టుండి రోడ్డు పైకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న ఇనుప గేటు పైకి ఎక్కి చిన్న పిల్లల తరహాలో ఆడుకుంటోంది. దాన్ని చూడగానే జనం పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బులంద్‌షహర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నరోరా గంగా బ్యారేజీ వద్ద ఉన్న కాలువ నుంచి ఓ 8 అడుగుల మొసలి ఉన్నట్టుండి బయటికి వచ్చింది. అయితే అటూ ఇటూ తిరిగే క్రమంలో అది చివరకు రోడ్డు పక్క ఫుట్‌పాత్ మీదకు చేరుకుంది. దీంతో తిరిగి మళ్లీ నదిలోకి వెళ్లేందుకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలో దిక్కుతోచని మొసలి చివరకు అక్కడే ఉన్న (crocodile climbing iron fence) ఇనుప కంచె మీదకు ఎక్కబోయింది.

Viral Video: పిల్లాడిని ఎత్తుకెళ్లాలని ఆకాశం నుంచి దూసుకొచ్చిన డేగ.. తీరా దగ్గరికి రాగానే షాకింగ్ ట్విస్ట్..


ఇనుప కంచె పైకి ఎక్కిన మొసలి అటువైపు ఉన్న నీటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ సాధ్యం కాక ఇనుప కంచె నుంచి ధబేల్‌మని కిందపడింది. చివరకు అటూ ఇటూ తిరుగుతూ అక్కడే తచ్చాడుతూ ఉంది. రోడ్డు పైకి వచ్చిన మొసలిని చూసి అంతా భయందోలనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చివరకు చాలా సేపు శ్రమించి, మొసలిని ఎట్టకేలకు నీటిలోకి వదలడంతో అంతా హమ్మయ్య..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ఆగలేకపోయిన వరుడు.. వధువు పక్కన ఉండగానే.. స్టేజీ కిందకు దూకేసి మరీ..


అయితే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఇది కొత్తేం కాదు. గతంలోనూ మొసళ్లు ఇలాగే నీటిలో నుంచి రోడ్డు మీదకు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కాగా, మొసలి రోడ్డు పైకి వచ్చిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డుపై ఆడుకుంటున్న మొసలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. చనిపోయాడనుకున్న దశలో ఎలా బ్రతికించారో చూడండి..

Updated Date - May 29 , 2024 | 09:16 PM

Advertising
Advertising