Viral Video: పులి ఆకలి బాధ.. మొసలిని వేటాడేందుకు పరుగుపరుగున వెళ్లగా.. చివరకు..
ABN, Publish Date - Nov 28 , 2024 | 12:17 PM
ఆకలితో ఉన్న ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అయినా దానికి ఏ జంతువూ కనిపించదు. దీంతో ఆకలి బాధతో పులి అలమటించిపోతుంది. ఎలాగైనా ఏదో ఒక జంతువును తినేసి తన ఆకలిని తీర్చుకోవాలని చూస్తుంటుంది. ఇంతలో..
టైం బాగోలేకపోతే ఎలాంటి వారికైనా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. ఇది జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది. సింహాలు, పులులు వంటి క్రూర జంతువులు కూడా అప్పుడప్పుడూ ఆహారం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంటుంది. అయినా వాటికి నిరాశే ఎదురవుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ పులికి వింత సమస్య వచ్చి పడింది. ఆకలి తీర్చుకోవడానికి మొసలిని వేటాడాలని వెళ్లగా.. చివరకు షాకింగ్ అనుభం ఎదురైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘పులికీ ఆకలి బాధలు తప్పలేదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి (Hungry Tiger) వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అయినా దానికి ఏ జంతువూ కనిపించదు. దీంతో ఆకలి బాధతో పులి అలమటించిపోతుంది. ఎలాగైనా ఏదో ఒక జంతువును తినేసి తన ఆకలిని తీర్చుకోవాలని చూస్తుంటుంది. ఇంతలో దానికి దూరంగా నీటిలో ఓ మొసలి కనిపిస్తుంది. మొసలిని చూడగానే పులికి ఆశలు చిగురిస్తాయి. మొసలిని తినేసి తన ఆకలి తీర్చుకోవాలని పరుగు పరుగున వస్తుంది.
Viral Video: కీటకమే కదా అని తక్కువగా చూస్తే ఇలాగే అవుతుంది.. బల్లి, పాము పరిస్థితి చివరకు..
అయితే తీరా నీటి ఒడ్డుకు వచ్చి మొసలిపై తన పంజా విసరగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. పులి ఇలా తన పంజా విసరగానే.. మొసలి అలెర్ట్ అవుతుంది. పులికి దొరక్కుండా ఎంతో చాకచక్యంగా నీటిలోకి (crocodile escaped from tiger attack) జారుకుని తప్పించుకుంటుంది. మొసలి నీటిలోకి వెళ్లిపోవడంతో పులి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పటిదాకా ఎంతో ఆశతో ఉన్న పులి.. మొసలి తప్పించుకోవడంతో మరింత కుంగిపోతుంది. అంతలో కాస్త దూరంలో మొసలి తాపీగా వెళ్లిపోవడం కనిపిస్తుంది. అయితే అప్పటికే అలసిపోయిన పులి.. మొసలిని దూరంగా చూసినా కూడా దాడి చేయలేక అలాగే నిలబడిపోతుంది.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులి ఆకలి బాధ చూస్తుంటే అయ్యో.. పాపం.. అనిపిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. ఈ పులికి పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 94 వేలకు పైగా లైక్‌లు, 3.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: బాంబులా మారిన టైరు.. గాలి నింపుతుండగా.. మైండ్ బ్లాకింగ్ సీన్.. చివరకు చూస్తుండగానే..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 28 , 2024 | 12:17 PM