Guinness World Records: ముక్కులో గుత్తులుగా అగ్గిపుల్లలు.. ఇతడి రికార్డ్ గురించి తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 23 , 2024 | 09:15 PM
ఒక్కొక్కరు ఒక్కో రంగంలో తమ ప్రతిభ కనబరుస్తూ రికార్డులు సాధించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి రికార్డుల్లో ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ రికార్డ్స్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరికీ గిన్నిస్ రికార్డ్స్ సాధించాలని ఉంటుంది. కానీ కొంతమంది...
ఒక్కొక్కరు ఒక్కో రంగంలో తమ ప్రతిభ కనబరుస్తూ రికార్డులు సాధించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి రికార్డుల్లో ప్రతిష్టాత్మకమైనది గిన్నిస్ రికార్డ్స్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరికీ గిన్నిస్ రికార్డ్స్ సాధించాలని ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే అలా ప్రయత్నించి సక్సెస్ అవుతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి విచిత్ర ప్రయోగం చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. ముక్కులో అగ్గిపుల్లలను గుత్తులుగా పెట్టుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో గిన్నిస్ రికార్డ్స్ సాధించిన ఓ వ్యక్తి గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. డెన్మార్క్‌కు చెందిన పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే వ్యక్తి ముక్కు రంధ్రాల్లో ఏకంగా 68 అగ్గిపుల్లలను పెట్టుకుని (Guinness World Record) ప్రపంచ రికార్డు సాధించాడు. కనీసం 54 అగ్గి పుల్లలు పెట్టుకుంటే ఈ రికార్డ్‌కు అర్హులన్నమాట. కానీ బుస్కోవ్ మాత్రం ఏకంగా 68 అగ్గిపుల్లలను (man stuck 68 matchsticks in his nose) పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ రికార్డ్ ఎలా సాధ్యమైంది..? అని అతన్ని అడగ్గా.. తన ముక్కు రంధ్రాలు పెద్దగా ఉండటం, చర్మం సాగుతతూ ఉండడంతో ప్రయత్నించానని చెప్పారు. ఈ రికార్డు సాధించే క్రమంలో తను ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదని చెప్పుకొచ్చాడు. ఈ రికార్డును తానే మళ్లీ బ్రేక్ చేస్తానని కూడా ప్రకటించాడు. గిన్నిస్ రికార్డ్స్ సాధించిన ఇతడికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ‘‘గ్రేట్ బ్రదర్.. మీ ప్రయోగం వెరైటీగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అన్ని అగ్గిపుల్లలు పెట్టుకుంటే నొప్పి కలగలేదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: వంటగదిలోకి మొదటిసారి అడుగుపెట్టిన మోడ్రన్ కోడలు.. స్టవ్ వెలిగించగానే..