మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఎండ వేడిని భరించలేని కుక్క.. యజమాని ఇంట్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - May 21 , 2024 | 09:08 PM

కుక్కలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కుక్కలైతే మనుషులు కూడా ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు ప్రమాదాల నుంచి తాము తప్పించుకోవడమే కాకుండా తమ యజమానులను కూడా కాపాడుతుంటాయి. ఇలాంటి,,

Viral Video: ఎండ వేడిని భరించలేని కుక్క.. యజమాని ఇంట్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..
ప్రతీకాత్మక చిత్రం

కుక్కలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కుక్కలైతే మనుషులు కూడా ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని కుక్కలు ప్రమాదాల నుంచి తాము తప్పించుకోవడమే కాకుండా తమ యజమానులను కూడా కాపాడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కుక్క వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు వినూత్నంగా ఆలోచించింది. తన యజమాని ఇంట్లోకి వెళ్లి ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండడంతో మనుషులతో పాటూ జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా జంతువులు వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. తాజాగా, ఓ కుక్క (dog) ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు చిత్రవిచిత్రమైన పని చేసింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని గుర్తించడం మీ వల్ల అవుతుందా..


తన యజమాని ఇంట్లోకి వెళ్లిన కుక్క.. తెరచి ఉన్న ఫ్రిడ్జిలోకి దూరింది. అందులో ఖాళీగా ఉన్న ఓ ర్యాక్‌లో పడుకుంది. ఫ్రిడ్జ్ వద్దకు వచ్చిన మహిళ.. లోపల కుక్క పడుకుని ఉండడం చూసి అవాక్కైంది. కుక్క తెలివితేటలు చూసి ముచ్చటపడిపోయిన వారు.. బయటికి రావాలంటూ దాన్ని ప్రేమతో పిలిచారు. చల్లదనానికి అలవాటు పడ్డ కుక్క.. ‘‘నేను బయటికి రాను.. ఇక్కడే చాలా బాగుంది.. నన్ను విసిగించకండి’’.. అన్నట్లుగా మొరుగుతుంది.

Viral Video: ఈ పావురం దౌర్జన్యం మామూలుగా లేదుగా.. ఆకలి తీర్చుకోవడానికి అది చేసిన నిర్వాకం..


తర్వాత ఎలాగోలా కుక్కను బయటికి తీసిన యజమానులు.. దానికి ఐస్‌క్రీమ్ తినిపిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘కుక్క ప్లానింగ్ చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

Updated Date - May 21 , 2024 | 09:08 PM

Advertising
Advertising