Viral Video: ఏనుగును రెచ్చగొడితే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ పర్యాటకులను ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Dec 17 , 2024 | 10:03 AM
ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రశాంతంగా కనిపించే ఏనుగులు మనుషులకు సాయం చేయడం చూశాం.. అదే ఏనుగుకు కోపం వచ్చినప్పుడు జనాన్ని వెంటపడడం కూడా చూశాం. చిర్రెత్తుకొచ్చిన ఏనుగులు చివరకు పెద్ద పెద్ద వృక్షాలు, ఇళ్లను ధ్వంసం చేయడం కూడా చూశాం. ఇలాంటి.
ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రశాంతంగా కనిపించే ఏనుగులు మనుషులకు సాయం చేయడం చూశాం.. అదే ఏనుగుకు కోపం వచ్చినప్పుడు జనాన్ని వెంటపడడం కూడా చూశాం. చిర్రెత్తుకొచ్చిన ఏనుగులు చివరకు పెద్ద పెద్ద వృక్షాలు, ఇళ్లను ధ్వంసం చేయడం కూడా చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏనుగును కొందరు పర్యాటకులు రెచ్చగొట్టారు. దీంతో చివరకు ఆ ఏనుగు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో రైడ్‌కు వెళ్లిన పర్యాటకులు జంతువులను చూస్తూ సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో వారికి దూరంగా ఓ ఏనుగు కనిపిస్తుంది. దీంతో వాహనాన్ని ఆపి, కిందకు దిగి మరీ ఏనుగును చూస్తుంటారు. అంతటితో ఆగకుండా ఈలలు, కేకలు వేస్తూ ఏనుగును రెచ్చగొడతారు. దీంతో ఏనుగుకు చిర్రెత్తికొచ్చి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వస్తుంది.
Viral Video: సింహాన్ని చుట్టేసిన కొండచిలువ.. చివరికి ఏమైందో చూస్తే కళ్లు తేలేస్తారు..
ఏనుగు కోపంగా రావడం చూసి రోడ్డుపై ఉన్న వారంతా పరుగు పరుగున వెళ్లి వాహనం పైకి ఎక్కేస్తారు. రోడ్డు పైకి వచ్చిన ఏనుగు (elephant chased the tourists) వారిని చూసి వెంటపడుతుంది. దీంతో వాహనాన్ని రివర్స్‌లో ఫాస్ట్‌గా నడుపుతారు. కొంత దూరం వరకు ఆ వాహనాన్ని వెంబడించిన ఏనుగు.. ఆ తర్వాత మనసు మార్చుకుని వెనక్కు వచ్చేస్తుంది. ఏనుగు శాంతించడంతో వారంతా.. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంటారు.
Viral Video: ఈ డస్ట్ బిన్‌ను చూస్తే చెత్త వేయకుండా ఉండలేరు.. దీన్నెలా తయారు చేశారో చూస్తే..
ఈ ఘటనను మరో వాహనంలో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుతో కామెడీ చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘పర్యాటకులకు చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: దుకాణంలో కొనేదంతా బంగారం కాదు.. చిన్న టెక్నిక్‌తో ఎలా తేల్చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 17 , 2024 | 10:03 AM