ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఏనుగు శక్తి సరే.. యుక్తిని ఎప్పుడైనా చూశారా.. పనసపండును ఎలా తెంపిందంటే..

ABN, Publish Date - Oct 12 , 2024 | 07:06 PM

అడవిలో ఆహారం కోసం వెతుకుతున్న ఓ ఏనుగుకు దూరంగా ఓ పెద్ద పనస చెట్టు కనిపించింది. అయితే చాలా ఎత్తులో ఓ పనస పండు వేలాడుతూ కనిపించింది. అయితే పనస పండును తెంపే విషయంలో ఏనుగు ఎంతో తెలివిగా వ్వవహరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు..

ఏనుగులు ఎంత శక్తివంతవైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా శాంతంగా కనిపించే ఏనుగులకు.. కోపం వచ్చిందంటే మాత్రం వీరవిహారం చేస్తుంటాయి. ఈ క్రమంలో కంటికి ఏది కనిపించినా దాని తొండం దెబ్బకు నేలకూలాల్సిందే. వాహనాలు మొదలుకుని చెట్లు, ఇళ్లను కూడా సునాయాసంగా కూల్చేస్తుంటాయి. ఇంత శక్తి ఉన్న ఏనుగులు కూడా కొన్నిసార్లు యుక్తితో పని చేస్తుంటాయి. ఎంతో సున్నితంగా, మరెంతో తెలివిగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు చెట్టుకు వేలాడుతున్న పనసపండును చూడగానే ఆగలేకపోయింది. అయితే దాన్ని ఎవరూ గమనించకుండా ఎంతో తెలివిగా తెంచేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఆహారం కోసం వెతుకుతున్న ఓ ఏనుగుకు దూరంగా ఓ పెద్ద పనస చెట్టు కనిపించింది. అయితే చాలా ఎత్తులో ఓ పనస పండు (jackfruit) వేలాడుతూ కనిపించింది. అయితే పనస పండును తెంపే విషయంలో ఏనుగు ఎంతో తెలివిగా వ్వవహరించింది.

Viral Video: కుక్కర్ తెరుచుకోలేదని పొరపాటున ఇలా చేస్తున్నారా.. వీళ్లకేమైందో చూడండి..


చెట్టు కింద నిలబడ్డ ఏనుగు తొండాన్ని పాము లాగా మెల్లగా చెట్టుపైకి తీసుకుంటూ వెళ్లింది. ఎవరైనా చూస్తారేమో.. అన్నట్లుగా ఎంతో మెల్లగా.. చాకచక్యంగా తొండాన్ని కదిలిస్తూ చివరకు పనసపండుకు వద్దకు చేర్చింది. ఆ తర్వాత కాయను మెల్లగా తడుముతూ పరిశీలించింది. సైజు చూసుకున్నాక.. ‘‘ఈ పండు చిన్నగా ఉన్నా కూడా.. ఈసారికి ఇలా కానిద్దాం’’.. అనుకుంటూ పనసపండు (elephant pulling jackfruit from tree) చుట్టూ తొండాన్ని మెలితిప్పి కాయను సులభంగా తెంపేసింది.

Viral Video: ఆహా.. చూడముచ్చటైన సీన్.. బుడ్డోడికి ఈ కుక్క ఎలా సాయం చేస్తుందో చూస్తే..


ఇలా ఎంతో తెలివిగా పనసపండును తెంపిన ఏనుగును చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు. వెంటనే ఈ ఘటను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు తెలివి చూస్తుంటే ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ చోరీ ఎంతో అందంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.36 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ అడవిలో దాక్కున్న ఆవును.. 30 సెకన్ల లోపు గుర్తించడం మీ వల్ల అవుతుందా..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2024 | 07:08 PM