ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఏనుగుల గురించి తెలిసి కూడా అలాంటి తప్పే చేశాడు.. చివరికి దాని రియాక్షన్ ఏంటంటే..

ABN, Publish Date - Mar 23 , 2024 | 05:06 PM

ఏనుగులు చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపించినా.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండే ఏనుగులు.. ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చుతుంటాయి. వాహనాలను ఎత్తి పడేయడం, మేత వేయడానికి వచ్చిన యువతులపై దాడులు చేయడం వంటివి చేయడం...

ఏనుగులు చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపించినా.. కొన్నిసార్లు అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పటిదాకా సైలెంట్‌గా ఉండే ఏనుగులు.. ఉన్నట్టుండి ఉగ్రరూపం దాల్చుతుంటాయి. వాహనాలను ఎత్తి పడేయడం, మేత వేయడానికి వచ్చిన యువతులపై దాడులు చేయడం వంటివి చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏనుగులకు మేత వేస్తూ స్నేహం చేయాలని ప్రయత్నించిన యువకుడి పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు రోడ్డు పక్కన రెస్ట్ తీసుకుంటుంది. ఆ సమయంలో ఓ యువకుడు గడ్డి తీసుకుని, ఏనుగుకు అందించేందుకు వెళ్తాడు. గడ్డిని చూడగానే ఏనుగు కూడా తొండంతో దాన్ని తీసుకుని తినేస్తుంది. అంతటితో వెనక్కు వెళ్లిపోవాల్సిన యువకుడు.. అందుకు విరుద్ధంగా దాన్ని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. తొండంపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ స్నేహం చేయాలని చూస్తాడు. అప్పటికే చిరాకుగా ఉన్న ఏనుగు.. ‘‘ప్రశాంతంగా తింటుంటే.. మళ్లీ విసిగిస్తావా’’.. అన్నట్లుగా తీవ్ర ఆగ్రహంతో తొండంతో అతడిని (elephant pushed the man) ఒక్క తోపు తోసేస్తుంది. దెబ్బకు అతను ఎగిరి పక్కన పడతాడు.

Viral Video: కోతులను ఎలా కూల్ చేయాలో.. ఇతడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనుకుంటా..

ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కొందరు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అతన్ని పైకి లేపి పక్కకు తీసుకెళ్తారు. ఈ ఘటనలో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ ఏనుగుకు ఎంతో కోపం వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగులతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కారు పార్కింగ్‌కు స్థలం లేదని చింతిస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే..

Updated Date - Mar 23 , 2024 | 05:06 PM

Advertising
Advertising