ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లిన ఏనుగు.. కారణం తెలిస్తే.. గుండె తరుక్కుపోతుంది..

ABN, Publish Date - Jun 06 , 2024 | 04:39 PM

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. అప్పటిదాకా శాంతంగా ఉన్న ఏనుగులు.. ఉన్నట్టుండి బీభత్సం సృష్టించడం చూశాం. మరికొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

ప్రతీకాత్మక చిత్రం

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. అప్పటిదాకా శాంతంగా ఉన్న ఏనుగులు.. ఉన్నట్టుండి బీభత్సం సృష్టించడం చూశాం. మరికొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు ఆస్పత్రి వార్డులోకి దూసుకెళ్లింది. ముందుగా భయపడిపోయిన జనం.. తర్వాత అసలు విషయం తెలుసుకుని అయ్యో పాపం..! అని అంటున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి వార్డులో చికిత్స పొందుతుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ ఏనుగు ఆస్పత్రికి వద్దకు చేరుకుంది. అంతా దాన్ని చూసి ఎక్కడ దాడి చేస్తుందో అనే భయంతో పరుగులు తీశారు. ఆస్పత్రి వార్డు తలుపు వద్దకు వెళ్లిన ఏనుగు.. (elephant entered the hospital) కాళ్లు నేలపై మోపి పాకుతూ లోపలికి వెళ్లింది. దీంతో ఏనుగు ఏం చేస్తుందో తెలీక ఆస్పత్రికి సిబ్బంది కూడా అయోమయానికి గురయ్యారు.

Viral Video: ఈమేంటీ.. చూసేందుకు సున్నితంగా ఉన్నా.. ఎదురుగా చికెన్ పెట్టగానే..


అయితే లోపలికి వెళ్లిన ఏనుగు.. బెడ్‌పై పడుకుని ఉన్న తన సంరక్షకుడిని చూసి చలించిపోయింది. తొండంతో తన కేర్ టేకర్ చేయి పట్టుకుని బాధపడుతూ అక్కడే ఉండిపోయింది. తన సంరక్షకుడిని పరామర్శించిన ఏనుగును చూసి అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా, కొన్ని నెలల కిందట చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగుది ఎంత గొప్ప మనసు’’.. అంటూ కొందరు, ‘‘మనుషులు జంతువులుగా మారుతుంటే.. జంతువులు మనుషులుగా మారుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాల మధ్యలోకి రాయల్‌‌‌గా ఎంట్రీ ఇచ్చాడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jun 06 , 2024 | 04:39 PM

Advertising
Advertising