ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: స్కూటీపై వచ్చిన మహిళను చూసి హడలెత్తిన ఏనుగు.. సమీపానికి రాగానే అది చేసిన నిర్వాకం..

ABN, Publish Date - May 12 , 2024 | 10:43 AM

ప్రయాణ సమయాల్లో బైకర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొన్నిసార్లు సడన్‌గా జంతువులు అడ్డు రావడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి...

ప్రయాణ సమయాల్లో బైకర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొన్నిసార్లు సడన్‌గా జంతువులు అడ్డు రావడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్కూటీపై వచ్చిన మహిళను చూసి ఓ ఏనుగు హడలెత్తిపోయింది. సమీపానికి రాగానే ఏనుగు చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రహదారిపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళకు (woman riding scooty) విచిత్ర అనుభవం ఎదురైంది. వేగంగా వెళ్తున్న ఆమెకు.. మార్గ మధ్యలో ఓ ఏనుగు రోడ్డు దాటుతూ అడ్డుగా వచ్చింది. ఏనుగును (elephant) చూడగానే సదరు మహిళ భయంతో స్కూటీకి బ్రేకులు వేసింది. దీంతో వాహనం ఏనుగు సమీపానికి వెళ్లి ఆగింది.

Viral Video: యువతి తాపత్రయం చూసి జాలిపడ్డ గుర్రం.. చివరికి ఎలాంటి సాయం చేసిందంటే..


అయితే విచిత్రంగా ఏనుగే ఈమెను చూసి భయపడిపోయింది. ‘‘వామ్మో..! ఈమె ఎవరో గానీ.. చంపేసాలా ఉందే’’.. అని అన్నట్లుగా భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి.. రోడ్డు పక్కకు పారిపోతుంది. మామూలుగా అయితే ఆ సమయంలో ఏనుగును ఢీకొట్టి మహిళ కిందపడే పరిస్థితి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఏనుగే భయపడి పారిపోవడం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు చాలా ఫన్నీగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘దీనికి స్కూటీ అంటే భయమేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 12 , 2024 | 10:43 AM

Advertising
Advertising