ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే.. హిప్పోను ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో చూడండి..

ABN, Publish Date - Sep 01 , 2024 | 04:38 PM

అడవుల్లో జంతువుల మధ్య చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, హైనాలు తదితర క్రూర జంతువుల వేటలో అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తీరా వేటాడే సమయంలో..

అడవుల్లో జంతువుల మధ్య చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, హైనాలు తదితర క్రూర జంతువుల వేటలో అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తీరా వేటాడే సమయంలో తిరుగుబాటు జరగడం, లేదా ఏదో ఒక జంతువు ఎంటరై ఎదురుదాడి చేయడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు ప్రాణాపాయ సమయాల్లో ఒక జంతువు మరో జంతువుకు సాయం చేయడం కూడా చూస్తుంటాం. తాజాగా, ఓ ఏనుగు ఇలాంటి పనే చేసింది. హిప్పోను ప్రమాదం నుంచి కాపాడిన ఏనుగును చూసిన నెటిజన్లు.. ‘‘ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బోట్స్వానాలోని (botswana) ఒకవాంగో డెల్టాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని హిప్పోపొటామస్‌లు కలిసి నీటి ఒడ్డున మేత మేస్తుంటాయి. అదే సమయంలో అడవి కుక్కల గుంపు వేట కోసం వేచి వెతుక్కుంటూ అటుగా వస్తాయి. నీటి ఏనుగులను చూడగానే ఎలాగైనా వాటిలో ఏదో ఒకదానిపై దాడి చేయాలని అనుకుంటాయి. చివరకు అడవి కుక్కలన్నీ కలిసి హిప్పోలను చుట్టుముడతాయి. దీంతో హిప్పోలను తలోదారి పారిపోతాయి.

Viral Video: నీటిలో హిప్పో పవర్ ఎలా ఉంటుందో తెలుసా.. సింహం కంటపడడంతో ఏం చేసిందో చూడండి..


అయితే చివరకు కుక్కలన్నీ కలిసి ఒక హిప్పోను (Wild dog attack on hippo) టార్గెట్ చేసి వెంటాడుతాయి. దాన్ని గుంపు నుంచి పక్కకు వెంటపడుతూ వెళ్తాయి. అయితే పక్కన ఉన్న హిప్పోలు దాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోతాయి. ఈ క్రమంలో కొన్ని ఏనుగులు అక్కడికి వస్తాయి. హిప్పోపై అడవి కుక్కలు దాడి చేయడం చూసి.. ‘‘మేము ఉండగా.. మీ ఆటలు సాగవు’’.. అని అన్నట్లుగా ఒక్కసారిగా (Elephants chased wild dogs) హైనాలపై దాడికి దిగుతాయి. ఏనుగుల ఘీకాంర శబ్ధం వినగానే అడవి కుక్కలన్నీ అలెర్ట్ అవుతాయి. హిప్పోను వదిలేసి తమ కాళ్లకు బుద్ధి చెబుతాయి.

Viral Video: జంగిల్ సఫారీలో పులిని వీడియో తీస్తుండగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇలా ఏనుగులు హిప్పో ప్రాణాలు కాపాడి తమ గొప్ప మనసును చాటుకున్నాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుల పవర్ అంటే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగులు చాలా గొప్ప పని చేశాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పర్‌ఫెక్ట్ ఫోకస్ అంటే ఏంటో ఈ జింకను చూసి నేర్చుకోవాల్సిందే.. నీళ్లు తాగుతూ అది చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 04:38 PM

Advertising
Advertising