Viral Video: వామ్మో.. ఏనుగు పగబట్టిందా ఏంటీ.. ఊర్లోకి చొరబడి.. ఇళ్లను కూడా పేకమేడల్లా..

ABN, Publish Date - Aug 08 , 2024 | 09:55 AM

ఓ పెద్ద ఏనుగు అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. వస్తూ వస్తూనే ఎంతో ఆవేశంగా దూసుకొచ్చింది. రోడ్డుపై వేగంగా వచ్చే క్రమంలో దానికి ఓ పార్క్ చేసిన బైకు కనిపించింది. దీంతో దాన్ని తొండంతో ఒక్క తోపు తోసేసింది. దెబ్బకు ఆ బైకు దూరంగా ఎగిరిపడింది. తర్వాత..

Viral Video: వామ్మో.. ఏనుగు పగబట్టిందా ఏంటీ.. ఊర్లోకి చొరబడి.. ఇళ్లను కూడా పేకమేడల్లా..

ఏనుగు చూసేందుకు ఎంత శాంతంగా కనిపిస్తాయో.. కోపం వస్తే అంత బీభత్సం సృష్టిస్తుంటాయి. పెద్ద పెద్ద వాహనాలను సైతం అగ్గిపెట్టెల తరహాలో ఎత్తిపడేయడమం చూస్తుంటాం. కొన్నిసార్లు గ్రామాలు, పొలాల్లోకి చొరబడి హంగామా స‌ృష్టించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. ఓ ఏనుగు గ్రామాంలోకి చొరబడి బీభత్సం సృష్టించింది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఈ ఏనుగు పగబట్టిందా ఏంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద ఏనుగు (elephant) అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. వస్తూ వస్తూనే ఎంతో ఆవేశంగా దూసుకొచ్చింది. రోడ్డుపై వేగంగా వచ్చే క్రమంలో దానికి ఓ పార్క్ చేసిన బైకు కనిపించింది. దీంతో దాన్ని తొండంతో ఒక్క తోపు తోసేసింది. దెబ్బకు ఆ బైకు దూరంగా ఎగిరిపడింది. తర్వాత అంతే ఆవేశంగా గ్రామంలోకి వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఆటో కూడా కనిపించింది. దాన్ని కూడా ఒక్క తోపు తోసింది.

Viral Video: అత్యుత్సాహానికి పోతే ఇలాగే జరుగుతుందేమో.. ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఏమైందో చూడండి..


ఆ తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును తోసేయాలని ప్రయత్నించింది. అయితే అందులో ఉన్న డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని రివర్స్ చేసి తప్పించుకున్నాడు. అలాగే ముందుకు వెళ్లిన ఏనుగు.. గ్రామంలోని నిర్మాణాలపై పడింది. ముందుగా ఓ గుడిసెను పెకలించి పక్కన పడేసింది. తర్వాత ఇటుక గోడలను (elephant destroyed houses) కూడా దంతాలతో ధ్వంసం చేసింది. అంతటితో ఆగని ఏనుగు ఓ రేకుల ఇంట్లోకి వెళ్లి గోడను మొత్తం ఒక్క దెబ్బకు తోసిపడేసింది.

Viral Video: రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..


ఇలా చూస్తుండగానే ఆ గ్రామంలోని అనేక నిర్మాణాలను పేకమేడల్లా కూల్చేసింది. ఏనుగు ఆవేశాన్ని చూసి భయపడిపోయిన గ్రామస్తులు ఇళ్ల పైకి ఎక్కి చూస్తుండిపోయారు. కొందరు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘వామ్మో.. ఈ ఏనుగును చూస్తుంటే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఊరిపై పగబట్టిందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 08 , 2024 | 09:55 AM

Advertising
Advertising
<