Viral Video: అరే..! ఏంటీ విచిత్రం.. మొత్తానికి మెడికల్ స్టోర్స్‌ను సంతలా మార్చారుగా..
ABN, Publish Date - Dec 26 , 2024 | 07:07 PM
వింతలు, విశేషాలు, విచిత్ర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. మార్కెట్‌లో కూరగాయల విక్రయానికి సంబంధించిన అనేక వీడియోలను చూస్తుంటాం. అయితే ..
వింతలు, విశేషాలు, విచిత్ర ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. మార్కెట్‌లో కూరగాయల విక్రయానికి సంబంధించిన అనేక వీడియోలను చూస్తుంటాం. అయితే తాజాగా, మెడికల్ స్టోర్స్‌కు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఏంటీ విచిత్రం..! మందులు అమ్ముతున్నారా.. కూరగాయలు అమ్ముతున్నారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మార్కెట్‌లో కూరగాయల దుకాణాల తరహాలో ఓ ప్రాంతంలో మెడికల్ స్టో్ర్స్ (Medical Stores) వరుసగా ఉన్నాయి. దారిన వెళ్లే వారంతా వాటి వద్దకు వెళ్లి మందులు కొంటున్నారు. ఇందులో విచిత్రం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. వీళ్లు మందులు అమ్మే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
కూరగాయలు అమ్మే వ్యాపారుల తరహాలోనే ‘‘మందులు బాబూ మందులు.. నాణ్యమైన మందులు’’.. అన్నట్లుగా దారిన వెళ్లే వారిని పిలుస్తున్నారు. తమ దుకాణాల్లోనే కొనాలంటూ గట్టిగా కేకలు పెడుతూ పిలవడం అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇలా దుకాణదారులంతా బయటికి వచ్చి పిలుస్తుండడంతో చాలా మంది.. ఏ దుకాణానికి వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు. మొత్తానికి ఈ దుకాణదారుల నిర్వాకం చూసి దారిన వెళ్లే వారు తెగ నవ్వుకున్నారు.
Viral Video: ఈ చీమల తెలివి చూస్తే ముక్కున వేసేసుకుంటారు... పజిల్‌ను ఎలా పూర్తి చేశాయంటే..
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేంట్రా బాబోయ్.. అవి మందులు అనుకున్నారా.. కూరగాయలు అనుకున్నారా’’.. అంటూ కొందరు, ‘‘మెడికల్ మాఫియా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 2.63 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: దర్జాగా చోరీ చేయడం అంటే ఇదేనేమో.. రోడ్డు మధ్యలో వీళ్ల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 26 , 2024 | 07:07 PM