Viral Video: ఒకే కొమ్మపై డేగ, రాబందు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Aug 16 , 2024 | 09:40 PM

డేగ పవర్ ఎలా ఉంటుందో.. రాబందు వేట అంతకంటే పవర్‌ఫుల్‌‌గా ఉంటుంది. అయితే ఈ రెండు పక్షుల్లో ఏది పవర్‌ఫుల్ అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఒకే కొమ్మపై డేగ, రాబందు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

డేగ పవర్ ఎలా ఉంటుందో.. రాబందు వేట అంతకంటే పవర్‌ఫుల్‌‌గా ఉంటుంది. అయితే ఈ రెండు పక్షుల్లో ఏది పవర్‌ఫుల్ అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే దీనికి సమాధానం దొరుకుతుంది. ఒకే కొమ్మపై డేగ, రాబందు తారసపడ్డాయి. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా నెట్టింట నిత్యం పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే వాటిలో డేగ, రాబందులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఈ రెండింటి మధ్య ( hawk and vulture fight) జరిగిన ఫైట్ వీడియో ఒకటి నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది.

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసి మాట్లాడుతున్న ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..


ఓ రాబందు కొమ్మపై నిలవడి ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో అక్కడికి ఓ డేగ కూడా వస్తుంది. నేరుగా రాబందు ఉన్న కొమ్మపై వచ్చి వాలుతుంది. ‘‘ఈ కొమ్మపై నాకూ హక్కు ఉంది.. నేనూ ఇక్కడే నిలబడతా’’.. అన్నట్లుగా రాబందు వైపు చూస్తుంది. దీంతో రాబందు.. ‘‘నేను ఉన్నానని తెలిసి కూడా.. ఈ కొమ్మపై వాలడానికి నీకు ఎంత ధైర్యం.. ఉండు నీ పని చెబుతా’’.. అన్నట్లుగా దాని వైపు సీరియస్‌గా చూస్తుంది.

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..


ఆ వెంటనే ముక్కుతో డేగపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాబందు ఆవేశాన్ని చూసి డేగ భయంతో వణికిపోతుంది. ఈ రాబందుతో ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే బెటర్.. అని అనుకుందే ఏమో గానీ.. వెంటనే రాబందుకు దొరక్కుండా అక్కడి నుంచి జారుకుంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రాబందు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అవి కారు లైట్లా లేక క్యారీ బ్యాగులా.. అనుమానం వచ్చి తొలగించగా..

Updated Date - Aug 16 , 2024 | 09:44 PM

Advertising
Advertising
<