ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మానిటర్ బల్లిని కసితీరా కొరికిన నల్ల పాము.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, Publish Date - Aug 03 , 2024 | 09:25 AM

పాము కాటేసిందంటే దాదాపు ఎలాంటి జంతువైనా ప్రాణాలు వదలాల్సిందే. అందుకే దాని జోలికి వెళ్లేందుకు ఏం జంతువూ సాహసించదు. అయితే కొన్నిసార్లు పాములకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కాటేయాలని చూసి..

పాము కాటేసిందంటే దాదాపు ఎలాంటి జంతువైనా ప్రాణాలు వదలాల్సిందే. అందుకే దాని జోలికి వెళ్లేందుకు ఏం జంతువూ సాహసించదు. అయితే కొన్నిసార్లు పాములకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కాటేయాలని చూసి చివరకు ఖంగుతినాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మానిటర్ బల్లికి, పాము మధ్య బిగ్ ఫైట్ నడిచింది. ఈ క్రమంలో మానిటర్ బల్లిపై పాము పలుమార్లు కాటేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మానిటర్ బల్లికిఉన్నట్టుండి ఓ నల్ల పాము తారసపడుతుంది. ఈ క్రమంలో వాటి మధ్య సడన్‌గా (fight between monitor lizard and snake) ఫైట్ జరుగుతుంది. చివరకు మానిటర్ బల్లి పాము తోక పట్టుకుంటుంది. దీంతో పాము ఒక్కసారిగా విలవిల్లాడిపోతుంది. మానిటర్ బల్లి నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..


అయినా బల్లి మాత్రం పామును వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మానిటర్ బల్లిని పాము పదే పదే కలితీరా కాటేస్తుంది. అయినా మానిటర్ బల్లికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. మరోవైపు పాము మాత్రం బల్లిని కాట్లే వేస్తూనే ఉంటుంది. కడుపు వద్ద చాలా సార్లు కాటేసిన పాము.. ఆ తర్వాత దాని ముందు, వెనుక కాళ్ల వద్ద కూడా కాటు వేస్తుంది. అయినా మానిటర్ బల్లి మాత్రం పాము తోకను అలాగే పట్టుకుని ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: పామును పేపర్లలో చుట్టేసి నిప్పు పెట్టిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాముకు షాక్ ఇచ్చిన మానిటర్ బల్లి’’.. అంటూ కొందరు, ‘‘మానిటర్ బల్లిని పాము ఏమీ చేయలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఎలాంటి విష సర్పం అయినా మానిటర్ బల్లిని చంపలేదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో.. ప్లాట్‌ఫామ్‌పై ఈమె చేసిన పని చూడండి..

Updated Date - Aug 03 , 2024 | 09:25 AM

Advertising
Advertising
<