ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసి ఉండరు.. పాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు..

ABN, Publish Date - Jul 17 , 2024 | 03:25 PM

పాము, ముంగిస ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి మధ్య ఒక్కసారి ఫైట్ మొదలైతే.. ఏదో ఒకటి చనిపోయే వరకూ ఆ యుద్ధం ఆగదు. కొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు..

పాము, ముంగిస ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి మధ్య ఒక్కసారి ఫైట్ మొదలైతే.. ఏదో ఒకటి చనిపోయే వరకూ ఆ యుద్ధం ఆగదు. కొన్నిసార్లు పాములు పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు ముంగిసలు విజయం సాధిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాము, ముంగిస మధ్య భీకర పోరు జరిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నాగుపాముకు అనుకోకుండా ముంగిస తారసపడుతుంది. ఇంకేముందీ.. పామును చూడగానే ముంగిస ఒక్కసారిగా (Mongoose attack on snake) దాడికి దిగింది. పాము కూడా ముంగిసను చంపేందుకు పలుమార్లు కాటు వేసింది. అయినా ముంగిస దాని కాటు నుంచి తప్పించుకుంటూ పాముకు చుక్కలు చూపించింది.

Viral Video: వర్షం రావడంతో పెళ్లి మంటపం నుంచి పారిపోయిన అతిథులు.. అయినా వరుడు మాత్రం వేదికపై నిలబడి..


ఈ క్రమంలో చివరకు పాము తలను గట్టిగా కొరికి మరీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ బెబ్బకు పాము తోక ముడిచింది. ముంగిస నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించింది. అయినా ముంగిస మాత్రం పామును వదలకుండా పదే పదే దానిపై దాడి చేస్తూ దాదాపు చంపే ప్రయత్నం చేసింది. అయితే చివరకు పాము ఎలాగోలా ముంగిస నుంచి తప్పించుకుని, అక్కడి నుంచి తప్పించుకుని చెట్ల పొదల్లోకి పారిపోయింది. దీంతో ముంగిస కూడా చివరకు తన దారిన తాను వెళ్లిపోయింది.

Viral Video: జలపాతం వద్ద రహస్యంగా పర్యాటకుల స్నానం.. సైలెంట్‌గా సమీపానికి వెళ్లిన పోలీసులు.. చివరకు..


అయితే ఈ పోరాటంలో పాము తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాము, ముంగిస పోరాటం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘తోక ముడిచిన పాము’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతిని తెరచిన వధువు.. లోపలి వస్తువును చూసి షాక్.. చివరకు ఛీ.. ఛీ.. అంటూ..

Updated Date - Jul 17 , 2024 | 03:25 PM

Advertising
Advertising
<