Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
ABN, Publish Date - Dec 01 , 2024 | 07:49 AM
ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా వేట దొరికితే.. మరికొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ..
ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా వేట దొరికితే.. మరికొన్నిసార్లు నోటిదాకా వచ్చిన ఆహారం చేజారిపోతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చేప ఆహారం అనుకుని నీటిలోంచి గాల్లోచి ఎగిరి పామును పట్టుంది. మధ్యలో మరో చేప కూడా ఎంట్రీ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటిలో ఆహారం కోసం వెతుకుతున్న చేపకు ఏదీ కనిపించలేదు. ఇంతలో దానికి నీటి పైన కొమ్మకు వేలాడుతున్న పాము కనిపించింది. దాన్ని చూసి ఆహారం అనుకుని నీటిలోంచి ఒక్కసారిగా గాల్లోకి (fish caught snake by flying into air) లేచి పాము తలను పట్టుకుంది. అయితే నీటిలోకి లాగేయాలని ఎంత ప్రయత్నించినా పాము మాత్రం కిందకు రాలేదు.
Viral Video: రోడ్డుపై చెరుకు బండిని ఫాలో చేసిన బైకర్.. దగ్గరికి వెళ్లాక రైతు రియాక్షన్ చూస్తే..
కొమ్మకు చుట్టుకుని ఉండడంతో దాన్ని లాగడం చేపకు సాధ్యం కాలేదు. ఇలా చాలా సేపు పామును లాగడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయినా దాని వల్ల మాత్రం సాధ్యం కాలేదు. ఇంతలో ఉన్నట్టుండి మరో రెండు చేపలు నీటిలోంచి గాల్లోకి లేస్తాయి. గాల్లోకి చేపల్లో ఓ చేప పైన వేలాడుతున్న చేప తోకను పట్టుకుని నీటిలోకి లాగేసింది. దీంతో ఆమె రక్షించబడడంతో పాటూ పాముకు కూడా సేఫ్ అయింది.
ఇలా పాము, చేపల మధ్య చోటు చేసుకున్న ఈ ఆసక్తికర సంఘటన ఓ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్నేహితుడి ప్రాణాలు కాపాడిన చేప’’.. అంటూ కొందరు, ‘‘ఈ చేప చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89 వేలకు పైగా లైక్‌లు, 16.5 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 01 , 2024 | 07:49 AM