Viral Video: వామ్మో..! ఎంత ఎండగా ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా.. ఈ విదేశీయుడు రోడ్డుపై చేస్తున్న పని చూస్తే..
ABN, Publish Date - Apr 19 , 2024 | 08:26 PM
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు....
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు కూల్‌డ్రింక్స్ తాగుతూ శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తే... మరికొందరు రోడ్డు పైకి గొడుగులతో వస్తూ ఎండ వేడి నుంచి తప్పించుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఓ విదేశీయుడు ఎండవేడికి తాళలేక ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఎంత ఎండగా ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో (Kerala) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ విదేశీయుడు (foreigner) మిట్ట మధ్యాహ్నం రోడ్డు పైకి వస్తాడు. అప్పటికే విపరీతమైన ఎండ ఉండడంతో అతడి భరించలేకపోతాడు. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఇతను మరీ విచిత్రంగా ఆలోచిస్తాడు. ఓ పెద్ద ఐస్ గడ్డతో (Ice cube) రోడ్డు పైకి వస్తాడు. ఐస్ ముక్కను రోడ్డుపై తోసుకుంటూ వెళ్తుంటాడు.
Viral Video: ఇలాంటి ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా.. ఈ వీడియో చూశాక.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
మధ్య మధ్యలో ఆగుతూ ఐస్ గడ్డపై కూర్చుని సేదతీరుతుంటాడు. ఇలా విడతల వారీగా ఐస్ గడ్డను తోసుకుంటూ, మళ్లీ దానిపై కూర్చుంటూ ముందుకు వెళ్తాడు. ఇతడి ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా షాక్ అవుతారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని అనేక ప్లాట్‌ఫామ్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే..! ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఎంత ఎండగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ఇది చిరుతపులా లేక సీఐడీ ఆఫీసరా.. చెట్టు కొమ్మపై కాలి గోర్లతో..
Updated Date - Apr 19 , 2024 | 08:26 PM