Viral Video: ఎంత స్నేహమైతే మాత్రం మరీ ఇదేంటీ.. రెండు రైళ్ల మధ్య వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:29 AM

ఫ్రెండ్‌షిప్ పేరుతో కొందరు, ప్రేమ పేరుతో ఇంకొందరు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. చాలా మంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. అలాగే కొందరు యువకులు స్నేహం పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చుట్టూ ఉన్న వారికి చిరాకు తెప్పిస్తుంటారు. కొన్నిసార్లు...

Viral Video: ఎంత స్నేహమైతే మాత్రం మరీ ఇదేంటీ.. రెండు రైళ్ల మధ్య వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

ఫ్రెండ్‌షిప్ పేరుతో కొందరు, ప్రేమ పేరుతో ఇంకొందరు చిత్రవిచిత్రమైన పనులన్నీ చేసేస్తుంటారు. చాలా మంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. అలాగే కొందరు యువకులు స్నేహం పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చుట్టూ ఉన్న వారికి చిరాకు తెప్పిస్తుంటారు. కొన్నిసార్లు వీరు చేసే పనుల వల్ల వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారు కూడా ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కొందరు యువకులు రెండు రైళ్ల మధ్య చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎంత స్నేహమైతే మాత్రం మరీ ఇదేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు (Youth) స్నేహం పేరుతో చేసిన ప్రమాదకర విన్యాసం (Dangerous Stunt) చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ రైల్లో వెళ్తున్న యువకులు చేతిలో బీడీలు పట్టుకుని ఎవరి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో పక్కన ఉన్న ట్రాక్‌లో మరో రైలు కూడా వెళ్తుంటుంది.

Viral Video: కాలం కలిసిరాకపోవడం అంటే ఇదేనేమో.. వీధిలోకి వచ్చిన మొసలికి.. చివరికి ఎలాంటి గతి పట్టిందంటే..


ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇవతలి ట్రైన్‌లో ఉన్న యువకుడు తన చేతిలోని బీడీలను పక్క ట్రాక్‌లో వెళ్తున్న రైల్లోని స్నేహితులను అందించాలని చూస్తాడు. చేతిని చాపి, బీడీలను చూపిస్తూ అవతలి రైల్లోని వారికి సంకేతం ఇస్తాడు. దగ్గరికి రాగానే అవతలి రైల్లో ఉన్న యువకులు.. (Friends exchanged beedis from two moving trains) ఇతను ఇచ్చిన బీడీలను తీసుకుంటారు. స్నేహం పేరుతో ఈ యువకులు చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా మండిపడుతున్నారు. పొరపాటున మధ్యలో విద్యుత్ స్తంభాలు తగిలితే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి పడవను ఎక్కడైనా చూశారా.. వర్షం వస్తే దీని పరిస్థితి ఏంటో..


అలాగే వీళ్లను చూసి వేరొకరు కూడా ఇలాగే చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల స్నేహమేమో గానీ.. కిందపడితే దేవుడు కనిపిస్తాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 09 , 2024 | 08:29 AM

Advertising
Advertising
<