ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కుక్క దగ్గర కోతి చేష్టలు.. ఈ కాకి వేషాలు మామూలుగా లేవుగా..

ABN, Publish Date - Oct 17 , 2024 | 10:44 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏమీ తోచని ఓ కాకిని ఎదురుగా ఓ కుక్క కనిపించింది. రోడ్డు పక్కన గోడపై ఉన్న కుక్కను చూడగానే.. ‘‘కాసేపు టైం చేస్తే పోలా’’.. అని అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి దాని వెనుక వాలింది.. చివరకు అది చేసిన నిర్వాకం ఏంటో మీరే చూడండి..

కొన్నిసార్లు పక్షులు, జంతువులు కూడా వాటి సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషుల తరహాలో వివిధ రకాల విన్యాసాలు చేయడం, ఇంకొన్నిసార్లు కామెడీ చేయడం చేస్తుంటాయి. ఇలాంటి చిత్ర విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కుక్క దగ్గర కోతి చేష్టలను చేసని కాకిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ కాకి వేషాలు మామూలుగా లేవుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏమీ తోచని ఓ కాకిని (crow) ఎదురుగా ఓ కుక్క కనిపించింది. రోడ్డు పక్కన గోడపై ఉన్న కుక్కను (dog ) చూడగానే.. ‘‘కాసేపు టైం చేస్తే పోలా’’.. అని అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి దాని వెనుక వాలింది. కుక్క పరధ్యానంలో ఉందని తెలుసుకుని వెనుక నుంచి మెల్లగా దగ్గరికి వెళ్లి తన ముక్కతో కుక్క తోకను పొడిచింది.

Viral Video: చేపను తినే సమయంలో మొసలికి ఊహించని షాక్.. చూస్తుండగానే గట్టు నుంచి ఒక్కసారిగా..


కాకి అలా పొడవగానే కుక్క ఉలిక్కిపడి వెనక్కు తిరిగి కోపంగా దాని వద్దకు వెళ్లింది. అయితే కుక్క అలర్టె్ అవగానే కాకి ఎగిరి దూరంగా వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత మళ్లీ మెల్లగా కుక్క వెనుకగా వెళ్లి తోకను పొడవాలని చూసింది. కానీ ఈ సారి కుక్క అలెర్ట్ అయింది. వెంటనే తిరిగి వెనక్కు చూసింది. దీంతో ఈ సారి కాకి ప్లాన్ వర్కవుట్ కాలేదు. కుక్క జాగ్రత్తగా ఉందని తెలుసుకుని దూరంగా నిలబడి దాన్ని గమనిస్తోంది. మధ్య మధ్యలో కుక్క వద్దకు వెళ్లాలని చూసినా సాధ్యం కాదు.

Viral Video: కదులుతున్న లారీలో ఇదేం పని.. ఇతడు చేసిన విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


తర్వాత గోడ కిందకు వెళ్లి మరీ ప్రయత్నించింది. అయినా కుక్క ముందర దాని వేషాలు సాగలేదు. ఇలా కుక్కతో చాలా సేపు కామెడీ చేయాలని చూసిన కాకిని చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గత జన్మలో ఈ రెండూ మంచి స్నేహితులై ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘మనుషులతో పోలిస్తే.. జంతువులు, పక్షుల మధ్య ఎక్కువ సామరస్యత ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 4.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అందరి ముందు హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 17 , 2024 | 10:44 AM