Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN, Publish Date - Sep 26 , 2024 | 04:16 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు మందుబాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మద్యం మత్తులో తోటి మనుషులతో పాటూ జంతువులతో ఆటలు ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంకొన్నిసార్లు..
మద్యం మత్తులో కొందరు ఏం చేస్తున్నారో.. వారికే తెలీనంతగా ప్రవర్తిస్తుంటారు. కొందరు రోడ్లపైకి వచ్చి డాన్సులు చేస్తుంటే.. మరికొందరు మురుగునీటిలో ఈత కొడుతుంటారు. ఇంకొందరు విష సర్పాలతో చెలగాటమాడుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి కుక్కకు ముద్దు పెట్టాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు మందుబాబులు (Drunken Man) చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మద్యం మత్తులో తోటి మనుషులతో పాటూ జంతువులతో ఆటలు ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంకొన్నిసార్లు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. ఫుల్‌గా మందు కొట్టిన ఆ వ్యక్తి అందరిలో ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనుకున్నాడు.
Viral Video: బైకుపై వినూత్న విన్యాసాలు చేయాలని చూస్తున్నారా.. వీళ్లూ అలాగే చేయగా.. చివరకు..
ఇందుకోసం చివరికి అక్కడే పడుకుని ఉన్న ఓ కుక్క వద్దకు వెళ్లాడు. దాని మానాన అది పడుకుని ఉంటే.. దగ్గరికి వెళ్లి ఇబ్బంది పెట్టాడు. అంతటితో ఆగకుండా దానికి (drunk man kissed a dog) ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. కుక్క మూతిపై ముద్దు పెడుతుండగా.. సడన్‌గా దానికి కోపం కట్టలు తెంచుకుంది. ‘‘ప్రశాంతంగా పడుకుని ఉంటే.. నీ ముద్దుల గోల ఏంట్రా’’.. అన్నట్లుగా భౌభౌమంటూ.. అతడిని కొరికే ప్రయత్నం చేస్తుంది. ముఖంపై గట్టిగా మొరగడంతో అతను భయంతో దూరంగా పడిపోతాడు. చాలా సేపు అలాగే పడుకుని ఉంటాడు.
Viral Video: పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు..
అతడి చేష్టలు చూసి అక్కడున్న వారు తెగ నవ్వుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘మందు ఎక్కువైతే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 87 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..
Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..
Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..
మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 26 , 2024 | 04:16 PM