ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆవునే కదిలించిన చిన్నారి.. ఎదరుగా మైక్ పెట్టగానే.. ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Aug 10 , 2024 | 10:39 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లలు జంతువులతో కలిసి ఆడుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్ని జంతువులు వారితో కలిసిపోతుంటాయి. మరికొన్నిసార్లు ..

పిల్లల ప్రవర్తన చూస్తే కొన్నిసార్లు చికాకు తెప్పిస్తుంది. అయితే మరికొన్నిసార్లు మాత్రం ఎంతో ముచ్చటేస్తుంది. కొందరు పిల్లలు తెలిసీ తెలీక చేసే పనులు చూస్తే.. అలాగే చూస్తుండిపోవాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి పిల్లల చేష్టలు ఎంత కఠిన హృదయం కలవారైనా కరిగిపోవాల్సిందే. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిన్నారి ప్రవర్తన.. ఏకంగా ఆవుకూ నచ్చినట్లుంది. దాని ఎదురుగా మైక్ పెట్టగానే ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లలు జంతువులతో కలిసి ఆడుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో కొన్ని జంతువులు వారితో కలిసిపోతుంటాయి. మరికొన్నిసార్లు జంతువులు కూడా చిన్నపిల్లలా మారి వారితో ఆడుకుంటుంటాయి. తాజాగా, ఓ చిన్నారి ప్రవర్తన చూసి ఆవుకు తెగ ముచ్చటేసినట్లుంది.

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..


చేతిలో మైక్ పట్టుకున్న ఓ చిన్నారి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆవు వద్దకు వెళ్తుంది. ఆవు ఎదురుగా నిల్చుని తన మాదిరే అరువు అంటూ సూచిస్తుంది. తర్వాత మైకు నోటి వద్ద పెట్టుకుని ఊ... అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత మైకును (girl put the mic in front of cow) ఆవు నోటి వద్ద పెడుతుంది. అప్పటిదాకా చిన్నారిని ఆసక్తిగా గమనిస్తున్న ఆవు.. ఆ పాప చెప్పిన విధంగా మైకు పెట్టగానే అంబా... అంటూ గట్టిగా అరుస్తుంది. తన మాట విని ఆవు అలా అరవడంతో చిన్నారి కూడా ఎంతో మురిసిపోతుంది.

Viral Video: తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో.. పిల్లలు లిఫ్ట్ ఆట ఆడుతుండగా..


ఇలా ఆవు, చిన్నారి స్నేహితుల్లా మరిపోయిన ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ జర్నిలిస్ట్ ఇంటర్వ్యూ ఎంతో ముద్దుగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ చిన్నారి ఇంటర్వ్యూ ఆవుకూ ఎంతో నచ్చినట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.90లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గంటకు 800కి.మీ వేగంతో దూసుకెళ్లే విమానం.. పైనుంచి చూడగా గుండె ఆగిపోయే సీన్..

Updated Date - Aug 10 , 2024 | 11:06 AM

Advertising
Advertising
<