Viral: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక.. సడన్‌గా లోపలికి వచ్చిన కోతులు. చివరకు ఆమెకు వచ్చిన ఐడియాతో..
ABN, Publish Date - Apr 13 , 2024 | 08:46 PM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వార్తలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులోనూ మనుషులపై దాడి చేసే జంతువులు, జంతువుల దాడి నుంచి తెలివిగా...
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వార్తలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులోనూ మనుషులపై దాడి చేసే జంతువులు, జంతువుల దాడి నుంచి తెలివిగా తప్పించుకునే మనుషుల వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా, ఈ తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని కోతులు లోపలికి వచ్చాయి. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బస్తీ జిల్లాలోని అబాస్ బికాష్ కాలనీలో ఈ ఘటన జరిగినట్లుగా తెలిసింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఇటీవల ఓ రోజు ఊహించని ఘటన చోటు చేసుకుంది. సదరు ఇంట్లో 13 ఏళ్ల బాలిక.. 15 నెలల తన చెల్లెలిని ఆడిస్తోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి (monkeys entered the house) కోతుల గుంపు ఇంట్లోకి చొరబడింది. ఇటీవల కోతులు ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేసిన ఘటనలు గుర్తు రావడంతో సదరు బాలిక భయపడిపోయింది. దీనికితోడు వాటిలో ఓ కోతి ఆడుకుంటున్న పాప వద్దకు వెళ్లడంతో.. ఎక్కడ ఆ కోతి చిన్నారిపై దాడి చేస్తోందో అని ఆందోళన చెందింది.
Viral Video: మొసలి కంటపడిన పాము.. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించడంతో.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
అయితే ఇలాగే భయపడుతూ కూర్చోకుండా, కోతిని ఎలా బయటికి పంపాలి.. అని ఆలోచించింది. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘‘అలెక్సా’’ పరికరాన్ని చూడగానే ఆమెకు ఓ ఐడియా వస్తుంది. కుక్క మొరుతున్న శబ్ధాలు కావాలంటూ.. అలెక్సా పరికరానికి ఆదేశాలు ఇస్తుంది. దీంతో వెంటనే స్పీకర్ల నుంచి కుక్కలు మొరుగుతున్నట్లు శబ్ధాలు గట్టిగా వస్తాయి. ఈ శబ్దాలు వినగానే కోతి అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. దీంతో ఆమె హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంటుంది. సరైన సమయంలో ఎంతో తెలివిగా ఆలోచించి చిన్న పిల్లను కాపాడిన బాలికను చుట్టు పక్కల వారంతా అభినిందించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Watch Video: అరటిపండ్లతో ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా చూశారా.. తొక్క తీసి చూడగా పండు మధ్యలో..
Updated Date - Apr 13 , 2024 | 08:50 PM