Share News

Viral Video: ఫేర్‌వెల్ రోజున వేదికపై డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు.. హఠాత్తుగా వచ్చిన ప్రిన్సిపాల్ చేసిన పనికి అందరూ షాక్!

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:23 PM

ఏ విద్యార్థికైనా పాఠశాలను ఏదో ఒకరోజు వదిలి వెళ్లక తప్పదు. పాఠశాలలో చివరి రోజు ఏ విద్యార్థి అయినా సరదాగా, సందడిగా గడపాలనుకుంటాడు. అందుకే స్కూలు యాజమాన్యం, టీచర్లు చాలా ఘనంగా ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేస్తారు. పిల్లలు సరదాగా గడపడానికి అవకాశం కల్పిస్తారు.

Viral Video: ఫేర్‌వెల్ రోజున వేదికపై డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు.. హఠాత్తుగా వచ్చిన ప్రిన్సిపాల్ చేసిన పనికి అందరూ షాక్!

ఏ విద్యార్థికైనా (Student) పాఠశాలను (School) ఏదో ఒకరోజు వదిలి వెళ్లక తప్పదు. పాఠశాలలో చివరి రోజు ఏ విద్యార్థి అయినా సరదాగా, సందడిగా గడపాలనుకుంటాడు. అందుకే స్కూలు యాజమాన్యం, టీచర్లు చాలా ఘనంగా ఫేర్‌వెల్ పార్టీ (School farewell) ఏర్పాటు చేస్తారు. పిల్లలు సరదాగా గడపడానికి అవకాశం కల్పిస్తారు. ఆ రోజున విద్యార్థులు తమ ఆటపాటలతో అందరినీ అలరిస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా విద్యార్థులు అలాగే చేశారు. అయితే స్కూల్ ప్రిన్సిపాల్ (Principal) వింత ప్రవర్తన అందరికీ షాక్ కలిగించింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం జరుగుతోంది. నలుగురు అమ్మాయిలు చీరలు ధరించి వేదిక ఎక్కి ``సారీ కే ఫాల్ సా కభీ మ్యాచ్ కియా రే`` పాటకు డ్యాన్స్ వేస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చాడు. ``పాట ఆపండి, ఇక్కడి నుంచి వెళ్లండి`` అంటూ కేకలు వేశాడు. దీంతో వేదిక మీద అమ్మాయిలు బిత్తరపోయారు. వారి డ్యాన్స్ చూస్తున్న వారు కూడా షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 23 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ అమ్మాయిలను ప్రిన్సిపాల్ దారుణంగా అవమానించాడు``, ``ప్రిన్సిపాల్ చాలా స్ట్రిక్ట్ అనుకుంటా``, ``ఆ ప్రిన్సిపాల్‌కు సెల్యూట్``, ``ఇది మరీ దారుణం`` అంటూ నెటిజన్లు తమ అభిప్రాయలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Harsh Goenka: దోశెలు వేసినా సరే మీ స్టైల్ చూపించండి.. హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఆసక్తికర వీడియో!


Puzzle: మీవి నిజంగా డేగ కళ్లు అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పును 10 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2024 | 03:23 PM