Viral News: వరుడిని ఇరకాటంలో పడేసిన ‘మోదీ’ పేరు.. ఎందుకో తెలుసా?
ABN, Publish Date - Apr 30 , 2024 | 10:39 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్లంతా వివిధ మార్గాల్లో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్తుంటారు. ఓ వరుడు కూడా మోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్లంతా వివిధ మార్గాల్లో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్తుంటారు. ఓ వరుడు కూడా మోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలని ప్రయత్నించాడు. కానీ.. ఆ ప్రయత్నం బెడిసికొట్టి, అతడిని ఊహించని చిక్కుల్లో పడేసింది. ఏకంగా ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బిర్యానీ ఆకుల్ని ఇలా తింటే.. ఈ సమస్యలు మటుమాయం
కర్ణాటకలోని (Karnataka) దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకలో నివాసముంటున్న ఓ వ్యక్తికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇందుకోసం అతడు పెళ్లి పత్రికలను ముద్రించాడు. అయితే.. మోదీపై ఉన్న అభిమానంతో అతడు తన పెళ్లి పత్రికల్లో ఆయన పేరుని ప్రస్తావించాడు. ‘‘మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి.. నరేంద్ర మోదీకి ఓటు వేసి, మళ్లీ ఆయనను ప్రధానమంత్రిగా చేయడమే’’ అని ప్రింట్ చేయించాడు. ఇది గమనించిన వరుడి బంధువు ఒకరు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి.. ఇలాంటివి చేయడం చట్టవిరుద్ధం. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, వరుడి ఇంటికి వెళ్లారు.
రాత్రి కన్న ‘కలే’ ఆమె ప్రాణాలు కాపాడింది.. అసలు ఏమైందంటే?
ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించావని అధికారులు చెప్పగా.. తాను చేసిన పనికి వరుడు ఓ వివరణ ఇచ్చుకున్నాడు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) తేదీలను ప్రకటించక ముందే తాను మార్చి 1వ తేదీన పెళ్లి పత్రికలు ముద్రించానని తెలిపాడు. ప్రధాని మోదీపై అభిమానం, దేశం పట్ల బాధ్యతతోనే తాను ఆ ట్యాగ్‌లైన్‌ని ప్రింట్ చేయించానని చెప్పాడు. అతని సమాధానంతో సంతృప్తి చెందని అధికారులు.. ఏప్రిల్ 26వ తేదీన అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతనితో పాటు పత్రికలు ముద్రించిన యజమానిపై కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. కాగా.. ఆ వ్యక్తి ఏప్రిల్ 18వ తేదీనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
Read Latest Prathyekam News and Telugu News
Updated Date - Apr 30 , 2024 | 10:40 AM