Viral Video: మరీ కరువు బ్యాచ్‌లా ఉన్నారే.. పెళ్లిలో దోసెలు వేస్తుండగా.. వీళ్ల నిర్వాకం చూస్తే..
ABN, Publish Date - Dec 21 , 2024 | 08:01 AM
ఓ వివాహ కార్యక్రమంలో అతిథులకు వివిధ రకాల విందు భోజనాలను ఏర్పాటు చేశారు. అతిథులంతా భోజన కౌంటర్ల వద్దకు వెళ్లి తమకు ఇష్టమైన ఫుడ్ తింటున్నారు. ఈ క్రమంలో దోసెలు వేసే ప్రాంతంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది.
పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వధూవరులు ఒకరినొకరు ఆడుకోవడం, వారి స్నేహితులంతా కలిసి వేదికపై ప్రాంక్ చేయడం వంటివి చూస్తుంటాం. అలాగే భోజనాల వద్ద కూడా కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో దోసెలు వేస్తుండగా.. చుట్టుముట్టిన అతిథులు చివరకు ఏం చేశారో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో అతిథులకు వివిధ రకాల విందు భోజనాలను ఏర్పాటు చేశారు. అతిథులంతా భోజన కౌంటర్ల వద్దకు వెళ్లి తమకు ఇష్టమైన ఫుడ్ తింటున్నారు. ఈ క్రమంలో దోసెలు వేసే ప్రాంతంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. చాలా మంది ఒక్కసారిగా దోసెలు (dosa) వేస్తున్న ప్రాంతానికి వచ్చారు.
Viral Video: ఇలాంటి బహుమతి ఎక్కడైనా ఉంటుందా.. వరుడి స్నేహితుల నిర్వాకానికి అవాక్కైన వధువు..
అంతా వాటిని తినేందుకు పోటీ పడ్డారు. చేసేదేమీ లేక వంట వారు కూడా ఓపిగ్గా దోసెలు వేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇలా దోసెలు వేస్తున్నారో లేదే.. అలా వెంటనే వాటిని ప్లేటులోకి లాగేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట కూడా జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ దోసెల కోసం ఎగబడ్డారు. ఎవరికి వచ్చిన ముక్కను వారు ప్లేటులో వేసుకుని తినడం కనిపించింది. ఈ తమాషా సంఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: వాహనాలకు గ్యాస్ నింపుతున్నారా.. ఇతడికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం వివిధ వేదికల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓరి నాయనో.. వీళ్లు మరీ కరువు బ్యాచ్‌లా ఉన్నరే’’.. అంటూ కొందరు, ‘‘దోసెల కోసం పోరాటమే చేస్తున్నారు కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చిరుతకు షాక్ ఇచ్చిన కుందేలు.. పట్టుకోవాలని ప్రయత్నించగా చివరకు ఏం జరిగిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 21 , 2024 | 08:01 AM