ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raksha Bandhan: తండ్రి భుజం ఎక్కి.. హాస్టల్‌లో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు!

ABN, Publish Date - Aug 19 , 2024 | 07:08 PM

రక్షా బంధన్.. సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రవణ మాసం పౌర్ణమి నాడు వచ్చిన ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఆగస్టు-19న ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో అంతా మంచే జరగాలని ప్రార్థిస్తారు..

Raksha Bandhan

రక్షా బంధన్.. (Raksha Bandhan) సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రవణ మాసం పౌర్ణమి నాడు వచ్చిన ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఆగస్టు-19న ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో అంతా మంచే జరగాలని ప్రార్థిస్తారు. సోదరులు కూడా.. తమ సోదరీమణులను ఎల్లవేళలా రక్షణగా ఉంటానని.. కడదాకా ప్రేమగా ఉంటానని అభయం ఇస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలో‌ జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.


అసలేం జరిగింది..?

రక్షా బంధన్ రోజున తోడబుట్టిన అన్న లేదా తమ్ముడికి అక్కాచెల్లెమ్మలు రాఖీ కట్టడం సంప్రదాయం. ఎంతో సంతోషంగా అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి పాపం.. నిరాశే ఎదురైంది. దాసరి అశ్విక, సహస్ర అనే ఇద్దరు బాలికలు మంచిర్యాల జిల్లా రామక్రిష్ణాపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో‌ చదువుతున్నారు. అక్కలిద్దరూ రాఖీ పండుగ అయినా ఇంటికి రాకపోవడంతో.. స్వీట్లు, రాఖీలు తీసుకుని తండ్రితో కలిసి జితేంద్ర హాస్టల్‌ దగ్గరికి వెళ్లాడు. అయితే.. హాస్టల్ వార్డన్, వాచ్‌మెన్‌లు.. లోపలికి ఎంట్రీ లేదు అని గేటు దగ్గరే ఆపేశారు. రాఖీనే కదా మేడమ్.. ఐదు నిమిషాల పని అంతే కదా అని మొత్తుకున్నా సరే అస్సలు లోపలికి అనుమతించలేదు. అప్పటికే.. బయట జితేంద్ర, లోపల అక్కలిద్దరూ ఒక్కటే ఏడుపు. ఏం చేయాలో ఆ తండ్రికి తోచలేదు. ఎలాగైనా సరే రాఖీ కట్టించుకునే ఇంటికి వెళ్లాలని కుమారుడు పట్టుబట్టాడు. ఇంతలోనే తండ్రికి ఓ ఐడియా వచ్చింది. హాస్టల్ వెనుక వైపు వెళ్లిన ఆ తండ్రి.. కుమార్తెలను పేర్లు పెట్టి పిలిచారు. ఇంతలోనే వారిద్దరూ కిటికీ దగ్గరికి రాగా.. జితేంద్రను భుజాలపై ఎక్కించుకున్న తండ్రి.. అక్కలతో రాఖీలతో కట్టించుకున్నాడు. అనంతరం కిటికీలో నుంచే ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఆ తర్వాత ఇటు తమ్ముడు, అటు అక్కలు ఎంతో సంతోషంగా వెనుదిరిగారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.


ఎందుకిలా..?

రాఖీ కట్టించుకోవడానికి హాస్టల్‌ లోపలికి అనుమతించకపోవడం ఏంటి..? హాస్టల్ వార్డన్ ఎందుకిలా ప్రవర్తించారు..? అంటూ మేనేజ్మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. నిజంగా ఈ బ్రదర్.. ఆ సిస్టర్స్ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన రాఖీ పండుగను చూశామని కొందరు అంటుంటే.. వీళ్లే రియల్ సిస్టర్స్ అండ్ బ్రదర్ అని మరికొందరు మెచ్చుకుంటున్నారు. గుండెల్ని పిండేసే ఘటన అంటున్నారు జనాలు. ఏం చేసైనా సరే రాఖీ కట్టించుకోవాలని జితేంద్ర.. ఇందుకోసం ఆ తండ్రి చేసిన సాహసానికి సాటి అన్నదమ్ముళ్లు, అక్క చెల్లెళ్లు సలాం కొడుతున్నారు. నిజమైన, హార్ట్ టచింగ్ రక్షా బంధన్ ఇదేనేమో మరి..! ఇదిలా ఉంటే.. హాస్టల్ మేనేజ్మెంట్‌పై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు కూడా సర్వత్రా వస్తున్నాయ్.

Updated Date - Aug 19 , 2024 | 07:22 PM

Advertising
Advertising
<