PM Kisan installment: పీఎం కిసాన్ నిధి పేమెంట్ పడిందా? లేదా?.. ఈజీగా ఇలా చెక్ చేయొచ్చు
ABN, Publish Date - Jun 17 , 2024 | 03:40 PM
ఇక ముచ్చటగా మూడవసారి ఏర్పడిన నరేంద్ర మోదీ నూతన సర్కార్ 17వ విడత పీఎం-కిసాన్ నిధి సాయాన్ని ఇటీవలే విడుదల చేసింది. సుమారు రూ.20,000 కోట్లు మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో మొదటి సంతకంగా విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు ఖాతాల్లో పడ్డాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల విషయంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ పథకం ద్వారా సుమారు 9.3 కోట్ల మంది రైతులకు లబ్ది పొందుతున్నారు. ఇక ముచ్చటగా మూడవసారి ఏర్పడిన నరేంద్ర మోదీ నూతన సర్కార్ 17వ విడత సాయం రేపు ( జూన్ 18) విడుదల కానుంది. ఈ మేరకు సుమారు రూ.20,000 కోట్లు మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో మొదటి సంతకంగా మంజూరు చేశారు. అయితే ఈ డబ్బులు ఖాతాల్లో పడతాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా చేసుకోవచ్చు
1. పీఎం కిసాన్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి.
2. బెనిఫిషియరీ స్టేటస్ పేజీని క్లిక్ చేయాలి
3. బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి
4. ఆధార్ లేదా ఖాతా నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి
5. గెట్ డేటాపై క్లిక్ చేయండి
6. బెనిఫిషియరీ స్టేటస్‌లోకి వెళ్లి పేమెంట్ పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఈ-కేవైసీ తప్పనిసరి
పీఎం-కిసాన్ నిధి ప్రయోజనం పొందుతున్న రైతులు ఇటీవలే విడుదలైన 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటు ఆ తర్వాతి పేమెంట్లను పొందాలంటే ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. రెండు మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
ఓటీపీ విధానంలో ఈ-కేవైసీ
1. పీఎం-కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. (https://pmkisan.gov.in/).
2. ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కింద ఉండే ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
3. ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి
4. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ
1. లబ్దిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రాష్ట్ర సేవా కేంద్రానికి వెళ్లాలి.
2. ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను చెప్పాల్సి ఉంటుంది
3. సీఎస్‌సీ ఆపరేటర్ లబ్దిదారుల వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ చేసి బయోమెట్రిక్ అథంటికేషన్‌ను పూర్తి చేస్తారు. ఈ విధంగా రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా పీఎం-కిసాన్ నిధి ప్రయోజనాలను పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
పాకిస్థాన్‌లోని ధనిక బిచ్చగాడు ఇతనే.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా
విమానంలో ఇచ్చిన ఫుడ్‌లో బ్లేడ్.. ఎయిర్ ఇండియా ప్యాసెంజర్‌కు భారీ షాక్!
For more Prathyekam News and Telugu News
Updated Date - Jun 17 , 2024 | 03:57 PM