ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నదిలో కూర్చుని గిటార్ వాయిస్తున్న యువకుడు.. సడన్‌గా దగ్గరికి వచ్చిన కొండచిలువ.. చివరకు..

ABN, Publish Date - May 18 , 2024 | 03:35 PM

నాదస్వర శబ్ధానికి నాట్యం చేసే పాములను చూశాం. ఇందులో వాస్తవం లేకున్నా చూసేందుకు మాత్రం నాదస్వర శబ్ధానికి పరవశించి నాట్యం చేసినట్లుగానే అనిపిస్తుంది. అలాగే పిల్లనగ్రోవి శబ్ధానికి జంతువులు కూడా పరవశించిపోతున్నట్లు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ...

నాదస్వర శబ్ధానికి నాట్యం చేసే పాములను చూశాం. ఇందులో వాస్తవం లేకున్నా చూసేందుకు మాత్రం నాదస్వర శబ్ధానికి పరవశించి నాట్యం చేసినట్లుగానే అనిపిస్తుంది. అలాగే పిల్లనగ్రోవి శబ్ధానికి జంతువులు కూడా పరవశించిపోతున్నట్లు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కొండచిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నదిలో కూర్చుని గిటార్ వాయిస్తున్న యువకుడి వద్దకు.. సడన్‌గా ఓ కొండచిలువ వస్తుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో (Australia) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ యువకుడు రాయిపై కూర్చుని, కాల్లను నది నీటిలో ఉంచి గిటార్ (guitar) వాయిస్తుంటాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కొండచిలువ (python) మెల్లగా పాకుతూ అక్కడికి వస్తుంది.

Viral Video: కారు కడగడం ఓకే గానీ.. మరీ విచిత్రంగా.. నీళ్లు అలా పోయడం ఏంట్రా బాబోయ్..


గిటార్ శబ్ధానికి పరశించినట్లుగా ప్రవర్తిస్తుంది. అతడికి ఎలాంటి హానీ చేయకుండా.. ‘‘గిటార్ భలే వాయిస్తున్నావ్’’.. అని ప్రశంసించనట్లుగా అతడి కాళ్ల వద్ద అటూ ఇటూ తిరిగి, తర్వాత అక్కడి నుంచి మెల్లగా మళ్లీ నీటిలోకి వెళ్లిపోతుంది. అతను కూడా కొండచిలువను చూసినా ఎలాంటి భయం లేకుండా.. దానిపై చేయి పెట్టి ప్రేమగా నిమురుతాడు. ఆ తర్వాత కొండచిలువ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. జనాల మధ్యలో ఓ వ్యక్తి లాగి మరీ..


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కొండచిలువకు గిటార్ అంటే ఇష్టమేమో’’.. అంటూ కొందరు, ‘‘ఇది మ్యూజిక్ లవర్‌లా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత పెళ్లి అయితే మాత్రం మరీ ఇదేంటీ.. ఈ వరుడి డాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 18 , 2024 | 03:35 PM

Advertising
Advertising