ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆకలేసిన ఏనుగు.. మొదటి అంతస్తులోని ఆహారాన్ని ఎలా కొట్టిసిందో చూస్తే..

ABN, Publish Date - Aug 07 , 2024 | 07:47 AM

ఏనుగులు తలచుకుంటే ఎంత పెద్ద వృక్షాన్నైనా ఇట్టే నేల కూలుస్తాయి. అలాంటిది ఇక వాటికి ఆకలేసిందంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతెత్తున ఉన్న చెట్టు కొమ్మల్లోని పండ్లను సైతం తొండంతో అవలీలగా తెంపేస్తుంటాయి. అప్పటికీ...

ఏనుగులు తలచుకుంటే ఎంత పెద్ద వృక్షాన్నైనా ఇట్టే నేల కూలుస్తాయి. అలాంటిది ఇక వాటికి ఆకలేసిందంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతెత్తున ఉన్న చెట్టు కొమ్మల్లోని పండ్లను సైతం తొండంతో అవలీలగా తెంపేస్తుంటాయి. అప్పటికీ సాధ్యం కాకపోతే చెట్లను వేర్లతో సహా పెకలించేస్తాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆకలేసిన ఓ ఏనుగుకు సమీపంలో ఏ ఆహారం కనిపించలేదు. దీంతో ఓ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తుపై కన్నేసింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు విపరీతమైన (hungry elephant) ఆకలి వేసినట్లు ఉంది. అయితే తినడానికి సమీపంలో ఏదీ కనిపించలేదు. దీంతో చాలా సేపు ఆహారం కోసం వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లింది. చివరకు అక్కడ ఉన్న ఓ పెద్ద బిల్డింగ్ వద్దకు వెళ్లి చుట్టూ చూసింది.

Viral Video: ఖరీదైన ఇంటి గోడలో షాకింగ్ సీన్.. పగుళ్ల నుంచి శబ్ధం రావడంతో ఏంటా అని చూస్తే.. చివరకు ఇళ్లంతా..


అక్కడా ఏమీ కనిపించకపోవడంతో చివరకు ఒకటో అంతస్తులోని కిటికీపై కన్నేసింది. ఇంకేముందీ తన ముందు కాళ్లను గోడపై పెట్టి ఏకంగా (elephant searched for food on first floor) మొదటి అంతస్తు కిటికీలోకి తొండం పెట్టి లోపల మొత్తం వెతికింది. ఆహార పదార్థాల కోసం చిన్న పిల్లలు ఏ విధంగా వెతుకుతారో.. అచ్చం అలాగే ఈ ఏనుగు కూడా కిటికీలో తొండం పెట్టి వెతకసాగింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు గమనించి, తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

Viral Video: తల్లీబిడ్డను రైలు ఎక్కించాలని చూడగా ఊహించని షాక్.. చివరకు యువకుడు చేసిన పనేంటో మీరే చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దొంగగా మారిన ఏనుగు’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగు బరువును కూడా తట్టుకునేలా ప్రభుత్వ భవన నిర్మాణం ఉండడం ఆకట్టుకుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..

Updated Date - Aug 07 , 2024 | 07:47 AM

Advertising
Advertising
<