Viral Video: ఈ పావురం దౌర్జన్యం మామూలుగా లేదుగా.. ఆకలి తీర్చుకోవడానికి అది చేసిన నిర్వాకం..
ABN, Publish Date - May 21 , 2024 | 05:47 PM
ఆకలి తీర్చుకోవడానికి కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాగే పక్షులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ఆకలి తీర్చుకోవడానికి కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాగే పక్షులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పావురం వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలి తీర్చుకోవడానికి పావురం చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పావురం దౌర్జన్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ పావురానికి (Hungry Pigeon) విపరీతంగా ఆకలి వేసినట్లు ఉంది. చుట్టూ చూసినా దానికి ఎలాంటి ఆహారం కనిపించలేదు. అయితే అదే సమయంలో అక్కడే ఓ బాలుడు విత్తనాలు తింటూ కనిపించాడు. అతన్ని చూడగానే పావురానికి ఆశలు చిగురించినట్లు ఉన్నాయి. ఎలాగైనా అతడి చేతిలోని ఆహారం తినేయాలని నిర్ణయించుకుని బాలుడిపై వాలిపోయింది. అయితే అప్పటికే ఆ బాలుడు విత్తనాలను నోట్లో వేసుకున్నాడు. అయినా బలవంతంగా అతడి నోట్లో తల పెట్టి మరీ విత్తనాలను తినేసింది.
Viral Video: పెళ్లంటే దోమల మంద అనుకున్నాడో ఏమో గానీ.. మంటపంలో ఈ వ్యక్తి చేసిన పనికి..
ఇలా బాలుడి నోటిలో ఉన్న విత్తానలు అన్నింటినీ తినేసింది. బాలుడు కూడా ఎంతో ప్రేమగా విత్తనాలను తినేందుకు సాయం చేశాడు. తర్వాత నీళ్లు బాటిల్లో ఉన్న నీటిని నోట్లో పోసుకుంటాడు. విత్తనాలను తిన్న పావురం చివరగా అతడి నోటిలో ఉన్న నీటిని కూడా తాగేసి తన ఆకలి తీర్చుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పావురం తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది రౌడీ పావురంలా ఉన్నట్టుందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఏనుగుల ఘీంకారం పవర్ అంటే ఇదీ.. సింహం దాడి నుంచి చిరుతను ఎలా రక్షించాయో చూస్తే..
Updated Date - May 21 , 2024 | 05:49 PM