ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇలాంటి ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా.. ఈ వీడియో చూశాక.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN, Publish Date - Apr 19 , 2024 | 07:18 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు కొత్త కొత్త రెసిపీలతో వినూత్న వంటలను చేస్తుంటారు. మరికొందరు రోజూ తినే ఆహార పదార్థాలనే వెరైటీగా చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు ...

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు కొత్త కొత్త రెసిపీలతో వినూత్న వంటలను చేస్తుంటారు. మరికొందరు రోజూ తినే ఆహార పదార్థాలనే వెరైటీగా చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆమ్లెట్‌ను వినూత్నంగా చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వినూత్నమైన ఆమ్లెట్ (innovative omelette) చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం ముందుగా అతను.. కొన్ని గుడ్లను తీసుకుని, అందులోని తెల్ల సొనను మాత్రమే ఓ గిన్నెలోకి తీసుకుంటాడు. తర్వాత ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్‌ను అందులో ఉంచి చాలా సేపు తిప్పుతాడు. దీంతో తెల్లసొన మొత్తం ఉబ్బెత్తుగా మారుతుంది. ఆ తర్వాత ఓ పాన్‌లో నెయ్యి వేసి వేడి చేస్తాడు. అనంతరం ఉబ్బెత్తుగా మరిన తెల్లసొనను అందులో వేసి పిజ్జా, ఊతప్పం తరహాలో చేస్తాడు.

Viral Video: టికెట్ తీసుకున్న వ్యక్తిని బోగీలోకి రాకుండా తలుపులు వేశారు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

అలాగే తెల్ల సొనపై తర్వాత పచ్చ సొన కూడా అలంకరణగా పెడతాడు. కొద్ది సేపు కాలిన తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసి, దానిపై ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, జున్ను ముక్కలతో పాటూ మసాలా దినుసులను వేస్తాడు. ఫైనల్‌గా ఈ వినూత్నమైన ఆమ్లెట్‌తో పాటూ కొన్ని బ్రెడ్ ముక్కలతో అలంకరించి కస్టమర్లకు అందిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‪‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనారోగ్యంగా మార్చేశారు’’.. అంటూ కొందరు, ‘‘ఇంతకీ ఇది తినేంకుకా.. లేక విసిరేసేందుకా’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 92 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది చిరుతపులా లేక సీఐడీ ఆఫీసరా.. చెట్టు కొమ్మపై కాలి గోర్లతో..

Updated Date - Apr 19 , 2024 | 07:18 PM

Advertising
Advertising