మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

ABN, Publish Date - Apr 28 , 2024 | 08:09 PM

రోజురోజుకూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో సాంకేతికతకు సంబంధించి కొన్నేళ్లుగా వివిధ విభాగాల్లో అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిలో విజయవంతంమైన ప్రయోగాలను ఆచరణలోకి తీసుకొస్తుంటారు. ఇలాంటి...

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

రోజురోజుకూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో సాంకేతికతకు సంబంధించి కొన్నేళ్లుగా వివిధ విభాగాల్లో అనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిలో విజయవంతంమైన ప్రయోగాలను ఆచరణలోకి తీసుకొస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, జపాన్ దేశానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 10 సెకన్ల నిడివిగల ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మనం 2050లో ఉన్నామా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టెక్నాలజీ రంగంలో జపాన్ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టెక్నాలజీతో చైనాకు కూడా గట్టి పోటీ ఇస్తుంటుంది. ఈ విషయం పక్కన పెడితే తాజాగా, జపాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ శుభ్రం చేసేందుకు (smart phone Cleaning) మనమైతే రిపేర్ షాపులో ఇవ్వాలి. మెకానిక్ దాన్ని ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేస్తాడు. దీనికి చాలా సమయం పడుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో (Japanese technology) జపాన్ టెక్నాలజీ చూస్తే దిమ్మతిరుగుతుంది.

Wedding viral video: దండలు మార్చుకుంటుండగా.. వరుడిని అనవసరంగా రెచ్చగొట్టారే.. చివరకు వధువు పరిస్థితి..


ఓ మెషిన్‌లో స్మార్ట్ ఫోన్‌కు సరిపడా రంధ్రం ఉంది. అందులో ఫోన్‌ను వేయగానే డోర్ లాక్ అవుతుంది. తర్వాత లైట్ల వెలిగి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇలా లోపలికి వెళ్లిన ఫోన్.. కొన్ని క్షణాల్లోనే పూర్తిగా శుభ్రంగా మారి బయటికి వస్తుంది. ఇలా ఫోన్ ఓపెన్ చేయకుండానే క్షణాల వ్యవధిలో శుభ్రమైపోయిందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! టెక్నాలజీ అద్బుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్నాలజీ చూస్తుంటే మనం 2050లో ఉన్నామా.. అనిపిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 70 వేలకు పైగా వ్యూస్‪‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో..! ఐడియా మామూలుగా లేదుగా.. ఎండ తగలకుండా ఇంటిని ఏసీగా ఎలా మార్చాడో చూస్తే..

Updated Date - Apr 28 , 2024 | 08:15 PM

Advertising
Advertising