Joint Family: పిల్లలు ఉమ్మడి కుటుంబంలో పెరగడం మంచిదేనా? అసలు నిజాలు ఏంటంటే..!
ABN , Publish Date - May 30 , 2024 | 04:13 PM
ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండేవి. పదుల కొద్దీ కుటుంబ సభ్యులు అందరూ ఉండటం వల్ల ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. అయితే రాను రాను ఉమ్మడి కుటుంబాలు చీలిపోయి ఆదర్శ కుటుంబాలు ఏర్పడ్డాయి.
ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండేవి. పదుల కొద్దీ కుటుంబ సభ్యులు అందరూ ఉండటం వల్ల ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. అయితే రాను రాను ఉమ్మడి కుటుంబాలు చీలిపోయి ఆదర్శ కుటుంబాలు ఏర్పడ్డాయి. ఇప్పటికాలం పిల్లలకు చాలా వరకు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో కూడా సరిగా తెలియదు. కానీ పిల్లలు ఉమ్మడి కుటుంబంలో పెరగడం మంచిదేనా? దీని వల్ల కలిగే లాభాలేంటి? తెలుసుకుంటే..
మద్దతు..
ఉమ్మడి కుటుంబంలో ఏ పనికి అయినా కుటుంబ సభ్యుల మద్దతు ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం పాలైతే చూసుకోవడానికి ఎవరూ లేరే అనుకోవాల్సిన ఇబ్బంది లేదు. ఇంటి పని చేసేవారు ఉండరనే ఆందోళన అవసరం లేదు. ఎంత పెద్ద పని అయినా అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల సులువుగానే చేసెయ్యవచ్చు.
ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!
బాధ్యతలు..
ఉమ్మడి కుటుంబంలో ఎక్కువమంది కుటుంబ సభ్యులు ఉండటం వల్ల పనుల భారం ఒక్కరిమీదనే ఉండదు. పనులను అందరూ విభజించుకోవడం వల్ల పనులన్నీ ఎలాంటి కంగారు లేకుండా సవ్యంగా పూర్తైపోతాయి. ఇక చిన్న పిల్లలు ఉంటే వారి సంర7ణ విషయంలో భయపడాల్సిన పని ఉండదు. కుటుంబ పెద్దలు పిల్లలను చూసుకుంటారు.
ఆర్థిక స్థితి..
ఎక్కువ మంది ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. ఇంటి అద్దె నుండి ఇతర ఖర్చుల వరకు చాలా డబ్బు పొదుపు అవుతుంది. పిల్లలు ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల వారు కూడా బాధ్యతగా, క్రమశిక్షణతో, ఆర్థిక విషయాలలో పొదుపుతో పెరుగుతారు.
పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.