మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: విషపూరిత పామును వెనిగర్‌లో ముంచాడు.. చివరకు గ్లాసులో జ్యూస్ తీసి..

ABN, Publish Date - Apr 30 , 2024 | 03:38 PM

ప్రస్తుత వేసవిలో చాలా మంది వివిధ రకాల జ్యూస్‌లు తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం వ్యాపారులు కూడా అనేక రకాల పండ్ల జ్యూస్‌లను తయారు చేస్తుంటారు. కొందరు వ్యాపారులైతే.. చిత్ర విచిత్ర రెసిపీలతో సరికొత్త జ్యూస్‌లను తయారు చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: విషపూరిత పామును వెనిగర్‌లో ముంచాడు.. చివరకు గ్లాసులో జ్యూస్ తీసి..

ప్రస్తుత వేసవిలో చాలా మంది వివిధ రకాల జ్యూస్‌లు తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వారి కోసం వ్యాపారులు కూడా అనేక రకాల పండ్ల జ్యూస్‌లను తయారు చేస్తుంటారు. కొందరు వ్యాపారులైతే.. చిత్ర విచిత్ర రెసిపీలతో సరికొత్త జ్యూస్‌లను తయారు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర జ్యూస్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, పాము జ్యూస్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇదేం జ్యూస్‌రా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద గ్లాసును టేబుల్‌పై ఉంచి, అందులో నుంచి పామును బయటికి తీశాడు. పడగ విప్పిన పామును బయటికి తీసి, అందరికీ చూపించాడు. అయితే తీక్షణంగా పరిశీలిస్తే.. ఆ పాము చనిపోయి (Dead snake) ఉన్నట్లు తెలుస్తుంది. చనిపోయిన పామును వెనిగర్‌లో నానబెట్టిన అతను.. అందులో మరికొన్ని రసాయనాలు కలిపి, చివరకు దాన్నుంచి వింత వైన్‌ను తయారు చేస్తున్నాడు. ఈ జ్యూస్‌ను (Snake juice) చిన్న గ్లాసులో వేసి కస్టమర్లకు అందజేస్తున్నాడు.

Viral Video: వామ్మో..! ఐడియా మామూలుగా లేదుగా.. ఎండ తగలకుండా ఇంటిని ఏసీగా ఎలా మార్చాడో చూస్తే..


అంతా ఈ స్నేక్ జ్యూస్‌ను లొట్టలేసుకుంటూ తాగేస్తున్నారు. వియాత్నాంలో ఈ స్నేక్ జ్యూస్‌ను చాలా మంది ఇష్టపడుతుంటారని తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలాంటి జ్యూస్ కూడా ఉంటుందా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: 2050లో ఉన్నామా..! ఆశ్చర్యానికి గురి చేస్తున్న 19 సెకన్ల వీడియో.. స్మార్ట్‌ఫోన్ లోపల వేయగానే..

Updated Date - Apr 30 , 2024 | 03:38 PM

Advertising
Advertising