ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బురదలోకి దిగిన పులికి చెమటలు పట్టించిన చేపలు.. చివరకు..

ABN, Publish Date - Aug 23 , 2024 | 03:32 PM

ఆకలితో ఉన్న ఓ చిరుతపులి వేట కోసం అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో దూరంగా ఓ బురదగుంట కనిపిస్తుంది. అందులో నీళ్లు తక్కువగా ఉండడంతో చాలా చేపలు కొట్టుమిట్టాడుతుంటాయి. వాటిని చూడగానే పులికి ప్రాణం లేచొస్తుంది. ఆ చేపలన్నింటినీ ఫినిష్ చేసేయాలని బురద గుంటలోకి దిగుతుంది. అయితే చేపలన్నీ కలిసి పులికి చెమటలు పట్టించాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

పులులు, సింహాల వేట ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒకసారి జంతువులను టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అన్నింటినీ ఇలాగే చిటికెలో వేటాడదామంటే కుదరదు. కొన్నిసార్లు వాటికి కూడా వేటాడటంలో ఎన్నో ఇబ్బందులు ఎదురువుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ చిరుతపులికి చేపలు చుక్కలు చూపించాయి. బురదలోకి దిగిన చిరుత పులి.. చేపలు వేటాడటం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘జంతువులను వేటాడినంత ఈజీ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుతపులి (Leopard) వేట కోసం అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే దానికి ఎలాంటి జంతువూ కనిపించదు. ఈ క్రమంలో దూరంగా ఓ బురదగుంట కనిపిస్తుంది. అందులో నీళ్లు తక్కువగా ఉండడంతో చాలా చేపలు కొట్టుమిట్టాడుతుంటాయి. వాటిని చూడగానే పులికి నోరూరిపోతుంది. ‘‘ఈ పూటకు వీటిని కానిద్దాం’’.. అని అనుకుంటూ బురదలోకి దిగి వాటిని పట్టుకోవాలని చూస్తుంది. అయితే, చేపలను వేటాడటం.. జంతువులను వేటాడినంత ఈజీ కాదు.. అని దానికి అర్థమైపోతుంది.

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌ను ఆక్రమించిన కోతులు.. ఏం చేస్తున్నాయో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


పులి బురదలో ఇలా కాలు పెట్టగానే చేపలన్నీ నీటిలోకి మునిగి క్షణాల్లో మరో చోటుకు చేరుకుంటాయి. దీంతో చేపలను పట్టుకోవడం పులికి పెద్ద పరీక్షగా మారుతుంది. ‘‘అరే.. ఇదేంటీ జంతువులను క్షణాల్లో వేటాడే నాకు.. ఈ చేపలు చుక్కలు చూపిస్తున్నాయే.. ఎలా పట్టుకోవాలబ్బా’’.. అని అనుకుంటూ అటూ, ఇటూ తిరిగి బురద గుంటలోకి పడిపోయిన చెట్టు కొమ్మ మీదకు వెళ్తుంది. దాని మీద నుంచి చేపలను (leopard tried to hunt fish) పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయినా చేపలు మాత్రం దానికి దొరక్కుండా తప్పించుకుంటాయి. దీంతో చిరుతకు చిర్రెత్తుకొచ్చి.. బురదలో తల ముంచి వెతుకుతుంది.

Viral Video: వామ్మో.. గూజ్‌బమ్స్ తెప్పించే వీడియో.. నక్కను వేటాడిన డేగ.. చివరికి..


అప్పటికీ పులికి చేపలు మాత్రం దొరకవు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చిరుత ఎట్టకేలకు ఎలాగోలా ధబేల్‌మని నీటిలోకి దూకి ఒక చేపను నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరుతపులికి చుక్కలు చూపించిన చేపలు’’.. అంటూ కొందరు, ‘‘జంతువులను వేటాడినంత ఈజీ కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 04:28 PM

Advertising
Advertising
<