Meta Fires Employee : భార్యతో ఆఫీసు ముచ్చట పంచుకున్నందుకు ఊస్టింగ్.. టెకీకి షాకిచ్చిన మెటా
ABN , Publish Date - Mar 17 , 2025 | 06:43 PM
భార్యతో ఆఫీసు విషయాలు పంచుకున్నందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తన జాబ్ పోగొట్టుకున్నాడు. మెటా సంస్థలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం పోతే ఆర్థికంగా మానసికంగా పెద్ద దెబ్బతగులుతుంది. ఇక మంచి పనితీరు కనబరిచాక బోనస్ పొందే ముందు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే బాధితుడి పరిస్థితి మాటల్లో చెప్పలేము. మెటాకు చెందిన ఓ ఉద్యోగికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పటికే అందరికీ తెలిసిన ఆఫీసు విషయాలను భార్యతో పంచుకున్నందుకు సదరు ఉద్యోగి జీవితం తలకిందులైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, మెటాలో ఇటీవల సరిగా పనిచేయని ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంచనాలు అందుకోని ఉద్యోగులకు షాక్ తప్పవంటూ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ షేర్ చేసిన ఓ పోస్టును బెర్టన్ తన భార్యతో పంచుకున్నారు. వాస్తవానికి ఈ నోటీ విషయం అప్పటికే మీడియాకు తెలిసిపోయింది. వార్తలు కూడా వెలువడ్డాయి. మరోవైపు, ఆఫీసు అంతర్గత సమీక్షలో బార్టన్ పనితీరుపై పైఅధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో, అతడికి అంచనాలకు మించి పనిచేశాడన్న రేటింగ్ వచ్చింది. బోనస్ కూడా ఖరారైంది.
Also Read: ఆరేళ్లు ఆఫీసుకు రాకున్నా ఫుల్ శాలరీ పొందిన ప్రభుత్వోద్యోగి.. అధికారులకు షాక్
ఇంతలో మార్క్ నోటీసును బెర్టన్ తన భార్యతో పంచుకున్న విషయం వెలుగులోకి రావడంతో అతడికి షాక్ తప్పలేదు. ఇది చాలా దారుణమంటూ బెర్టన్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఒక వేళ నా భార్య నా వెనక నిలబడి లాప్‌టాప్‌లో ఆ నోటీసు గురించి చదివినా లేక తన ఫోన్‌తో ఫొటో తీసుకున్నా ఇలా జరిగి ఉండేది కాదన్నాడు. తనంతట తానుగా షేర్ చేసినందుకు ఈ పరిస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫీసు విషయాల గోప్యతకు సంబంధించిన ఈ నిబంధన అమలు అస్థవ్యస్థంగా ఉందని అభిప్రాయపడ్డారు. తనలాగే అనేక మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆఫీసులో ఒత్తిడి గురించి జీవిత భాగస్వామితో పంచుకున్నా, తమ సొంత లాప్‌టాపుల్లో విషయాలు సేవ్ చేసుకున్నా ఇబ్బందులు మొదలవుతున్నాయని చెప్పారు. నోట్స్ అన్నీ ఐక్లౌడ్‌తో సింక్ అయ్యి ఉండటమే ఇందుకు కారణమని అన్నారు.
Also Read: ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ విమాన ప్రయాణం.. టిక్కెట్ ధర ఎంతో తెలిస్తే..
బర్టన్ ఉదంతంపై మెటా నేరుగా స్పందించలేదు. అయితే, కంపెనీ అంతర్గత సమాచారాన్ని లీక్ చేస్తే మాత్రం తాము ఏమాత్రం ఉపేక్షించమని గతంలోనే స్పష్టం చేసింది. ఉద్యోగికి ఉన్న కారణాలతో సంబంధం లేకుండా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. అసలు జీవిత భాగస్వాములతో ఆఫీసు విషయాలు పంచుకుంటే కూడా ఉద్యోగం నుంచే తీసేసే హక్కు సంస్థలకు ఉంటుందా అన్న చర్చ నెట్టింట సాగుతోంది.